Shahrukh Khan: షారుక్ ఖాన్ (Shahrukh Khan).. బాలీవుడ్ బాద్షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. రీఎంట్రీలో కూడా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించే సత్తా ఉన్న హీరోగా రికార్డు సృష్టించారు. అటు సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ.. బాలీవుడ్ బాక్సాఫీస్ కి భారీ ఊరట కలిగించిన ఈయన.. సినిమాల ద్వారానే కాదు ఆస్తుల విషయంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత ధనవంతుడిగా పేరు దక్కించుకున్న షారుక్ ఖాన్.. తన ఆస్తుల విషయంలో.. ఏ హీరో కూడా ఈయనకు దరిదాపుల్లో లేరు అనడంలో సందేహం లేదు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు వ్యాపారాలు.. అటు ఐపిఎల్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
నెలకు రూ.24.15 లక్షలు అద్దె చెల్లిస్తున్న షారుక్ ఖాన్..
ఇలా వేల కోట్ల ఆస్తులు ఉన్న షారుఖ్ ఖాన్ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే దేశంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటిగా నిలిచేలా తనకంటూ ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. దానికి మన్నత్ (Mannath) అని కూడా నామకరణం చేశారు. దీని విలువ సుమారుగా రూ.300 కోట్ల పై మాటే. ఇకపోతే వేల కోట్ల ఆస్తులున్న షారుక్ ఖాన్ తాజాగా రెండు ఇళ్ళను అద్దెకు తీసుకున్నారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది. ముంబైలోని పాలీహిల్ ఏరియాలో ఉండే రెండు డూప్లెక్స్ అపార్ట్మెంట్లను షారుక్ ఖాన్ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. నెలకు రూ.24.15 లక్షల చొప్పున ఏడాదికి రూ.2.9 కోట్ల అద్దె ఈ రెండు అపార్ట్మెంట్లకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
మన్నత్ నవీకరణ కారణంగానే ఇంత అద్దె..
మన్నత్ ను పెట్టుకొని షారుక్ ఖాన్ ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తున్నారు అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తుండగా.. అసలు విషయంలోకి వెళ్తే.. మన్నత్ లో మే నెల నుంచి భారీ నవీకరణ పనులు ప్రారంభం కానున్నాయట. ఈ ప్రాజెక్టుకు అనుమతులు కావాల్సిన అవసరం ఉండగా.. ఇటీవలే అధికారికంగా అనుమతులు కూడా మంజూరైనట్లు తెలుస్తోంది. మన్నత్ గ్రేడ్ 3 హెరిటేజ్ స్టేటస్ కలిగిన భవనం కావడంతో దీనిని విస్తరించడానికి అనేక అనుమతులు కూడా తీసుకోవాల్సి వచ్చిందట. మన్నత్ కు నవీకరణకు అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవీకరణ పనుల్లో భాగంగా కుటుంబానికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా మన్నత్ ను విడిచి, అద్దె ఇంట్లోకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది కాబట్టి షారుక్ ఖాన్ కుటుంబంతో కలిసి ఇల్లు మారినట్టు తెలుస్తుంది.
షారుక్ ఖాన్ కుటుంబం అద్దె ఉన్న ఇళ్లు ఎవరివంటే..?
ఇకపోతే షారుక్ ఖాన్ కుటుంబం అద్దెకు తీసుకున్న ఇల్లు ఎవరివనే విషయానికొస్తే.. నిర్మాత వశు భగ్నానీ పిల్లలైనా నటుడు జాకీ భగ్నానీ అలాగే దీప్శిఖా దేశ్ ముఖ్ లకు చెందినవని తెలుస్తోంది. అపార్ట్మెంట్లో 1వ, 2వ, 7వ, 8వ అంతస్తులు ఈ అపార్ట్మెంట్లో షారుక్ ఖాన్ కుటుంబంతో పాటు వారి భద్రతా సిబ్బంది , ఇతర సహాయక సిబ్బంది కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ కి ఇప్పుడు దాదాపు నెలకు రూ.24 లక్షలకు పైగా అద్దె చెల్లించబోతున్నారట షారుక్ ఖాన్.