BigTV English

Case on Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై కోర్టులో కేసు.. స్ట్రీమింగ్ ఆపేయాలని ఫిర్యాదు!

Case on Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై కోర్టులో కేసు.. స్ట్రీమింగ్ ఆపేయాలని ఫిర్యాదు!

Case on Netflix: ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు డిఫరెంట్‌ స్టోరీలను తీసుకువస్తున్నాయి. కొత్త కొత్త కథలతో పాటు యాధార్థ సంఘనలను కూడా చిత్రీకరించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాయి.


ఈ మధ్య రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను వెబ్‌స్టోరీ, డాక్యుమెంటరీల రూపంలో తెరకెక్కించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే అలాంటి యధార్థ సంఘటనల ఆధారంగా ఆడియన్స్ ముందుకు వస్తున్న క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా అలాంటి ఇబ్బందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సెన్సేషనల్ క్రైమ్స్‌ను డాక్యుమెంటరీల రూపంలో తీసుకువస్తుంది. తాజాగా ఇంద్రాణి ముఖర్జీ మహిళపై ఒక డాక్యుమెంటరీనీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూథ్’ టైటిల్‌తో దీనిని తీసుకువస్తున్నట్లు పేర్కొంది.


READ MORE: ముదురుతున్న బండ్లగణేష్-నౌహీరా షేక్ వివాదం.. సీన్ లోకి ఈడీ

షీనా బోరా మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై ఈ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తోంది. ఫిబ్రవరి 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో దీనికి లీగల్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి.

ఈ సిరీస్‌ స్ట్రీమ్ అవ్వకుండా ఆపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ముంబై కోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఇటీవల ముంబై‌లోని స్పెషల్ కోర్టులో అప్లికేషన్ కూడా దాఖలు చేసింది.

ఈ అప్లికేషన్‌ ప్రకారం.. 2012లో షీనా బోరా మర్డర్ జరిగిందని.. 2015లో అది వెలుగులోకి వచ్చిందని సీబీఐ తెలిపింది. అయితే ఇప్పటికీ ఈ కేసుపై విచారణ జరుగుతుందని.. ఇంకా ఈ కేసు క్లోజ్ అవ్వలేదని పేర్కొంది. ఇలా క్లోజ్ అవ్వని క్రైమ్ కేసును డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అందులో పేర్కొంది.

READ MORE: మీ ఫోన్లలోకి ‘హనుమాన్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఈ డాక్యుమెంటరీలో భాగమైన అందరూ ఈ అప్లికేషన్‌పై తప్పకుండా స్పందించాలని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్పీ నాయక్ కోరారు. ఫిబ్రవరి 20న ముంబై కోర్టులో ఈ కేసుపై హియరింగ్ జరగనుంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×