BigTV English

HanuMan OTT Release Date: మార్చ్ 2న ఒటీటీకి ‘హనుమాన్’.. ‘జీ5’ లో స్ట్రీమింగ్!

HanuMan OTT Release Date: మార్చ్ 2న ఒటీటీకి ‘హనుమాన్’.. ‘జీ5’ లో స్ట్రీమింగ్!
latest news in tollywood

On March 2 HanuMan Movie will be play on Zee5: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ – యంగ్ నటుడు తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎనలేని ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.


అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ దాదాపుగా ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అద్భుతమైన రెస్పాన్స్‌తో సెన్సేషనల్ రికార్డులను ఈ మూవీ క్రియేట్ చేసింది.

ఇక ఫస్ట్ డే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ ఇప్పటికీ అక్కడక్కడ రన్ అవుతూనే ఉంది. ఇక ప్రీమియర్స్ ద్వారా దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్, రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ టార్కెట్‌ను పూర్తి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.


Read More: ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. చాలా ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..!

అయితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలా మంది ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.

ఇప్పుడు హనుమాన్ మూవీ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీని మార్చి 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే ఇటీవలే ఈ మూవీ 300 సెంటర్స్‌లో 30 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుండగానే.. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీ సీక్వెల్‌ను ప్రకటించాడు.

Read More: హనుమాన్ సినిమా కోసం 75 సినిమాల్ని వదులుకున్నాను: తేజ సజ్జ

ఈ సీక్వెల్ చిత్రానికి గానూ ‘జై హనుమాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. అయితే ఈ మూవీ హనుమంతుని నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇందులో రాముని పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబును, హనుమంతునిగా మెగాస్టార్ చిరంజీవిని తాను ఊహించుకున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తెలిపాడు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×