BigTV English
Advertisement

Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఏమేమి తొలగించారంటే.. ?

Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఏమేమి తొలగించారంటే.. ?

Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మిస్టర్ బచ్చన్ గురించి హరీష్ శంకర్ ఇచ్చిన హైప్ మరో ఎత్తు. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన మాటల వలన మరింత హైప్ వచ్చి .. థియేటర్ కు వెళ్లే అభిమానులు ఎక్కువమంది ఉన్నారు అంటే అతియోశయోక్తి కాదు. ఆగస్టు 15 న మిస్టర్ బచ్చన్ థియేటర్ లో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ హడావిడి మొదలైపోయింది.

ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించడంతో పాటు.. కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా స్టార్టింగ్ లోనే అమితాబ్ బచ్చన్ – రేఖల ఫోటో కనిపిస్తుంది. అయితే రేఖ ప్లేస్ లో జయాబచ్చన్ ఉన్న ఫోటోను పెట్టమని సూచించిందట. జయాబచ్చన్ ను పెళ్లి చేసుకోక ముందు అమితాబ్- రేఖ మధ్య ప్రేమాయణం నడిచిన విషయం అందరికి తెల్సిందే.


ఇక ఇది కాకుండా ఈ కథ పూర్తిగా కల్పితం.. ఏ వ్యక్తికీ, ప్రాంతానికి సంబంధించింది కాదు అని డిస్క్లైమర్ ను పెట్టమన్నట్లు తెలుస్తోంది. రెండు నిముషాలు నిడివి ఉన్న సీన్ లో బీడీ ప్లేస్ లో పెన్సిల్ పెట్టాలని చెప్పిందట.మిస్టర్ బచ్చన్ నిడివి 2 గంటల 38 నిమిషాలు అని చెప్పుకొచ్చారు. ఇవి కాకుండా కొన్ని కొన్ని సీన్స్ లో మార్పులు చేసినట్లు సమాచారం. మొత్తానికి సినిమాను అయితే మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని సెన్సార్ బోర్డు తెలిపినట్లు మాట్లాడుకుంటున్నారు. మరి రవితేజ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×