BigTV English

RGV Vyooham movie : ఆర్జీవి వ్యూహంకి నో సర్టిఫికేట్.. షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

RGV Vyooham movie  : ఆర్జీవి వ్యూహంకి నో సర్టిఫికేట్..  షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..
RGV Vyooham

RGV Vyooham movie : సినిమాల కంటే కూడా కాంట్రవర్సీల కారణంగా ఎప్పుడు ఎక్కువ వైరల్ అవుతూ ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్న ఈ తరుణంలో అగ్నిలో తన వంతు ఆజ్యం పోయడానికి కొత్త మూవీతో ముందుకు వస్తున్నాడు వర్మ. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీస్తున్న మూవీ వ్యూహం. ఆయన మరణాంతరం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను, జగన్ సీఎం ఎలా అయ్యాడు అనేదాన్ని హైలైట్ చేసే మూవీ శపథం. ఇలా రామ్ గోపాల్ వర్మ రెండు మూవీస్ ను ఏపీ ఎన్నికలలోపు విడుదల చేరియాలి అనుకున్న విషయం తెలిసిందే.


అయితే ఇందులో వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డ్ రాంగోపాల్ వర్మ కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరగదు అని తెగేసి చెప్పింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాలో పాత్రలకు చాలావరకు నిజజీవితంలో పాత్రల పేర్లే పెట్టడం పై సెన్సార్ బోర్డ్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న అంశాలనే కథగా తీసుకొని చేయడం పై కాస్త అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది.

అయితే సెన్సార్ వ్యూహం సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం పై ఆ మూవీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పందించారు. బోర్డ్ వ్యక్తం చేసిన అభ్యంతరాల పై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. మొదటినుంచి పొలిటికల్ చిత్రాలకు కాస్త వివాదాన్ని యాడ్ చేసి హడావిడి చేయడం వర్మకు అలవాటే. అందుకే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ని బేస్ చేసుకుని మరింత హీట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.


రెండు భాగాలుగా తెరకేకుతున్న ఈ చిత్రం మొదటి భాగం వ్యూహం నవంబర్ 10 కి రిలీజ్ చేయాలి అని ఆర్జీవీ ప్లాన్.అందుకే వ్యూహం మొదటి భాగం ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే ట్రైలర్ చూస్తేనే అది ఎంత వివాదాలకు దారి తీస్తుందో అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ ఇంకెంత వివాదాస్పద అంశాలతో ఉంటుందో ఆలోచించండి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×