Chandra Babu Niadu Wishes to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో చిరు అందించిన సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఇప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ చిరంజీవిగా మారారు.
చిరుకు దక్కిన గౌరవానికి తెలుగు ప్రజలు అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
” రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: AP Elections 2024: ఏపీలో నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. రికార్డు స్థాయిలో పోలింగ్
ఇకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీతో పాటు జనసేన కూడా పొత్తు పెట్టుకున్న విషయం తెల్సిందే. జనసేనకు చిరు సపోర్ట్ గా నిలిచిన విషయం తెల్సిందే. మరి ఈ రెండు రోజుల్లో పవన్ కు అండగా పిఠాపురంలో చిరు ప్రచారం చేస్తాడో..లేదో చూడాలి.
https://twitter.com/ncbn/status/1788595389396066436