BigTV English

Chandrika Ravi : బాల‌య్య‌ను గుండెల్లో పెట్టుకుంటాన‌న్న న‌టి

Chandrika Ravi : బాల‌య్య‌ను గుండెల్లో పెట్టుకుంటాన‌న్న న‌టి

Chandrika Ravi : నంద‌మూరి బాల‌కృష్ణ‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌లా ఉంది అని అంటున్నారు చంద్రికా ర‌వి. సంక్రాంతిని పుర‌స్క‌రించి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది వీర‌సింహారెడ్డి. ఈ సినిమాలో చంద్రికా ర‌వి కీ రోల్ చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ నాయిక‌. కాక‌పోతే హ‌నీ రోజ్, చంద్రికా ర‌వి కూడా కొన్ని సీన్ల‌లో క‌నిపిస్తార‌ట‌. రీసెంట్‌గా రిలీజ్ అయిన మా బావ మ‌నోభావాల్ దెబ్బ‌తిన్నాయే పాట‌లో ఆడిపాడారు చంద్రికా ర‌వి. ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. “నంద‌మూరి బాల‌కృష్ణ సార్‌తో ప‌నిచేయ‌డమంటే మాట‌లు కాదు. నా క‌ల నిజ‌మైన‌ట్టు అనిపిస్తోంది. ఆయ‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం మాత్ర‌మే కాదు, ఆయ‌న‌తో డ్యాన్స్ చేయ‌డం అస్స‌లు మ‌ర్చిపోలేని అనుభూతి. జీవితాంతం ఈ జ్ఞాప‌కాల‌ను గుండెల్లో దాచుకుంటా“ అని అన్నారు చంద్రికా ర‌వి.


మా బావ మ‌నోభావాల్ దెబ్బ‌తిన్నాయే సాంగ్‌లో బ్యాక్ స్టెప్ వేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సోడా బండి మీద బాల‌య్య అలా స్టెప్పులు వేస్తుంటే వింటేజ్ బాల‌కృష్ణ గుర్తుకొస్తున్నార‌ని అంటున్నారు అభిమానులు. ఆల్రెడీ ఒక‌టికి మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఈ సారి విడుద‌ల‌య్యే పాట ఈ మూడిటినీ మించి ఉంటుంద‌ని ఉప్పందించేశారు లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య‌శాస్త్రి. మాస్ సాంగుల‌ను, హుషారైన పాట‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అనే పేరుంది గోపీచంద్ మ‌లినేనికి. ఆల్రెడీ ఆయ‌న మూడు పాట‌ల‌ను రిలీజ్ చేశారు. త‌మ‌న్ మ్యూజిక్ చార్ట్ బ‌స్ట‌ర్ అయింది. బాల‌కృష్ణ ఎన‌ర్జీకి త‌గ్గ‌ట్టున్నాయి పాట‌లు. గ‌తేడాది అఖండ‌తో ఇచ్చిన మ్యూజిక్‌ని ఈ ఏడాది వీర‌సింహారెడ్డితో త‌మ‌న్ కంటిన్యూ చేస్తున్నారంటూ అంద‌రూ మెచ్చుకుంటున్నారు. చంద్రికా ర‌వి అయితే త‌మన్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×