BigTV English

Venu Swamy: వేణు స్వామికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇక జాతకాలు చెప్పను అంటూ వీడియో రిలీజ్

Venu Swamy: వేణు స్వామికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇక జాతకాలు చెప్పను అంటూ వీడియో రిలీజ్

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ట్రోల్స్ కు గురవుతూ ఉంటాడు. ఇక గతంలో నాగ చైతన్య- సమంత పెళ్లి తరువాత.. వారు విడిపోతారని బాంబ్ పేల్చాడు. నాలుగేళ్ళ తరువాత అది నిజం అయ్యేసరికి వేణుస్వామి ఫేమస్ అయిపోయాడు. ఇక అలా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల జాతకాల ప్రకారం.. విడిపోతారని, గొడవలు అవుతాయని, పిల్లలు పుట్టరని చెప్పుకుంటూ వస్తున్నాడు.


ఇంకోపక్క హీరోయిన్లకు మంచి విజయాలు రావాలంటే పూజలు చేయాలనీ చెప్పి.. వారితో పూజలు జరిపిస్తున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక పవన్ గెలిచేసరికి.. ఫ్యాన్స్ అందరూ ఆయనకు మంచి ట్రీట్ మెంట్ ఇవ్వడంతో.. రాజకీయాల గురించి ఇక మాట్లాడను అని అధికారికంగా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు సెలబ్రిటీల జీవితాల గురించి కూడా మాట్లాడను అని మరో వీడియో పోస్ట్ చేశాడు.

ఈ మధ్యనే చై- శోభితా ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెల్సిందే. వీరు పెళ్లి చేసుకున్నాక విడిపోతారని, మళ్లీ చై లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుందని వేణుస్వామి  చెప్పాడు. అంతేకాకుండా చైకు పిల్లలు కూడా పుట్టరని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక దీనిపై కూడా ట్రోల్ నడిచాయి. ఈ ట్రోల్స్ పై తాజాగా వేణుస్వామి స్పందించాడు. తాను తన మాట మీదనే నిలబడినట్లు చెప్పుకొచ్చాడు.


చైతూ-సామ్ జ్యోస్యంకి కొనసాగింపుగా చెప్పాల్సి వచ్చిందని, అంతకు ముందు తాను చెప్పినట్లే.. మాట మీద నిలబడ్డాను అని క్లారిటీ ఇచ్చాడు. అయితే మంచు విష్ణు.. వేణుస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ముందు ఎలాంటి సెలబ్రిటీల జాతకాలను చెప్పడానికి వీలు లేదని తెలిపాడట. ఆ విషయాన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు పర్సనల్ గా తనకు కాల్ చేసి.. ఇలాంటివి ఆపేయమని తెలిపారని, ఆయన మాటను గౌరవించి తాను ఇంక ఏ సెలబ్రిటీ జాతకాలను చెప్పను అని చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ మంచు విష్ణును అభినందిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×