BigTV English

Commissioner Ranganath: ఆ ప్రాంతాల్లో స్థలాలను ఎవరూ కొనకండి: రంగనాథ్

Commissioner Ranganath: ఆ ప్రాంతాల్లో స్థలాలను ఎవరూ కొనకండి: రంగనాథ్

Commissioner Ranganath news(Telangana news today): చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌‌లల్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇస్టానుసారం నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకువస్తామని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు కుంటలు అన్నీ కలిపి 400లకు పైగా ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా నగరంలోని చెరువులను హైడ్రా ప్రధానంగా తీసుకుంటుందని అన్నారు.


ఎన్‌ఆర్‌ఎస్పీ ప్రకారం 44 సంవత్సరాల్లో చాలా చెరువులు కనుమరుగయ్యాయని తెలిపారు. 60 శాతం నుంచి 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని వెల్లడించారు.చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని.. అందు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందని అన్నారు. 2500 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందని వెల్లడించారు.

Also Read: మీరు పరాన్నజీవుల వలే ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు: హరీశ్ రావు


తమకు వందలాది మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. దశల వారిగా హైడ్రా పనిచేస్తుంది. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, ఆ తర్వాత అనుమతుల నిరాకరణ ఉంటుంది. మూడవ దశలో చెరువుల పూడిక తీసి వాటిని అన్నింటికి మళ్లీ పునర్జీవనం కల్పిస్తామని అన్నారు. గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×