BigTV English

Chhaava 3Days Collections: 3రోజుల్లోనే రూ.100 కోట్లు క్రాస్.. గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న బాలీవుడ్..!

Chhaava 3Days Collections: 3రోజుల్లోనే రూ.100 కోట్లు క్రాస్.. గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న బాలీవుడ్..!

Chhaava 3Days Collections:బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal ) నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా రూపొందిన చిత్రం ఛావా (Chhaava). శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసు భాయి పాత్రలో రష్మిక మందన్న అద్భుతంగా నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్త పలువురు కీలక పాత్రలు పోషించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ పోషించడం జరిగింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.


ప్రమోషన్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన యూనిట్..

ఇదివరకే ‘యానిమల్ ‘, ‘పుష్ప2’ సినిమాలతో రష్మిక క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఆ చిత్రాల ద్వారా వచ్చిన క్రేజ్.. ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఛావా ప్రమోషన్స్ ద్వారా కూడా భారీగా బజ్ క్రియేట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో అత్యధిక స్క్రీన్ లలో సినిమాను రిలీజ్ చేశారు. ఢిల్లీ , నోయిడా, ఎన్ సి ఆర్ ప్రాంతాలలో మొదటి రోజు 1100 షోలు, అటు బెంగళూరులో కూడా ఈ చిత్రాన్ని భారీగా ప్రదర్శించారు. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల షోలు ప్రదర్శించడం జరిగింది. దాదాపు ఇండియాలోనే ఈ సినిమాను సుమారుగా ఐదు వేల స్క్రీన్ లలో ప్రదర్శించారు. దాంతో తొలివారమే భారీగా కలెక్షన్లు నమోదు చేసుకుంది.


మూడు రోజుల్లోనే రూ.121 కోట్లు కలెక్షన్స్..

ఇక అలా మొదటి రోజు రూ. 33.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండవ రోజు రూ. 39.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక అదే జోరు చూపిస్తూ.. మూడవరోజు రూ.49.03 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటే ఇక రోజు రోజుకి ఈ సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ సినిమాకి నిన్న ఆదివారం కావడంతో వీకెండ్ బాగా కలిసి వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మూడు రోజుల్లోనే రూ.121.4 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించిన సినిమా మరొకటి లేదని ట్రేడ్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈ సినిమా కలెక్షన్స్ తో బాలీవుడ్ ఇప్పుడు భారీగా ఊపిరి పీల్చుకుంటుంది. సరైన సక్సెస్ లేక కలెక్షన్లు రాక సతమతమవుతున్న బాలీవుడ్ నిర్మాతలు ఈ ఒక్క సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ఆడియన్స్ ను బాగా మెప్పించింది. దీంతో నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×