Aloe Vara For Pigmentation: ముఖం అందంగా, తెల్లగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ముఖంపై మొటిమలు, మంగు మచ్చలు అందాన్ని పాడు చేస్తాయి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ సమస్య ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తోంది.
సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, వయస్సు పెరగడం, హార్మోన్ల మార్పులు లేదా స్కిన్ కేర్ పాటించక పోవడం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మంగు మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ముఖంపై నల్ల మచ్చలు పూర్తిగా పోవాలంటే ఎలాంటి హోం రెమెడీస్ వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద జెల్ యొక్క ప్రయోజనాలు:
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మాన్ని లోతుల నుండి తేమగా మారుస్తాయి.
ఇది మాత్రమే కాదు కలబందలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం యొక్క రంగును మెరుగుపరచడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. మంగు మచ్చలను తొలగించడానికి మీరు కలబంద జెల్‌ను ఈ క్రింది విధంగా కూడా ఉపయోగించవచ్చు.
కలబందను ముఖానికి ఎలా అప్లై చేయాలి ?
మీరు ఇంట్లో కలబంద ఆకుల నుండి తాజా జెల్ తీసుకుని వాడవచ్చు. అంతే కాకుండా మార్కెట్లో లభించే స్వచ్ఛమైన కలబంద జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. అలోవెరాను ముఖానికి అప్లై చేయడానికి ముందుగా ఫేస్ శుభ్రంగా వాష్ చేసుకోవడం చాలా మంచిది.
కలబంద :
కాస్త అలోవెరా జెల్ తీసుకుని ముఖం మీద, ముఖ్యంగా మంగు మచ్చలు ఉన్న ప్రదేశాలలో అప్లై చేయండి. తర్వాత 5-10 నిమిషాలు వృత్తాకారంగా మసాజ్ చేయండి. మెరుగైన ఫలితాల కోసం రాత్రంతా ముఖానికి అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా అలోవెరా జెల్ చర్మంలోకి బాగా కలిసిపోతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత, గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా అలోవెరా జెల్ వాడటం వల్ల, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. అంతే కాకుండా మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
Also Read: ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాల్సిన హెయిర్ మాస్క్‌లు ఇవే !
అలోవెరా, పసుపు:
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలోవెరాలో పసుపు కలిపి కూడా నల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం కాస్త పసుపు తీసుకుని అందులో తగినంత అలోవెరా జెల్ వేసి పేస్ట్ లాగా చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.
మరికొన్ని చిట్కాలు:
సూర్యరశ్మి పిగ్మెంటేషన్‌ను పెంచడంలో ప్రధాన కారకం కాబట్టి, ముఖానికి ప్రతి రోజు సన్‌స్క్రీన్‌ను తప్పకుండా ఉపయోగించండి.
పోషకాహారం తినండి. తద్వారా మీ చర్మానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది.
ఈ సులభమైన , సహజమైన చిట్కాలతో మీరు త్వరగా మంగు మచ్చలను వదిలించుకోవచ్చు. అంతే కాకుండా మెరుగైన చర్మాన్ని పొందవచ్చు.