BigTV English
Advertisement

Prabhas’s Raja Saab : రాజా సాబ్‌కు గ్రాఫిక్స్ కష్టాలు… నిరాశలో ప్రభాస్… మరోసారి పక్కా వాయిదా ?

Prabhas’s Raja Saab : రాజా సాబ్‌కు గ్రాఫిక్స్ కష్టాలు… నిరాశలో ప్రభాస్… మరోసారి పక్కా వాయిదా ?

Prabhas’s Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) కూడా ఒకటి. ఈ సినిమాకు గ్రాఫిక్స్ కష్టాలు మొదలయ్యాయని, దాని వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడడం పక్కా అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.


‘రాజా సాబ్’కు గ్రాఫిక్స్ కష్టాలు

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ‘ది రాజా సాబ్’ మూవీ వాయిదా పడడం ఖాయమంటున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ ప్రభాస్ కి నచ్చలేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దీంతో ప్రభాస్ రికమెండ్ చేసిన చేసిన వాళ్ళు, ఈ వర్క్ చేయడానికి అందుబాటులో లేరని అంటున్నారు. ఇక తాజాగా బయటకొచ్చిన ఈ విషయాన్ని విని, మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరీ అంత చీప్ క్వాలిటీ తో ‘ది రాజా సాబ్’ మూవీని రిలీజ్ చేద్దాం అనుకున్నారా ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


నిజానికి ‘ఆదిపురుష్’ మూవీ రిలీజ్ టైంలో ఇలా చీప్ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ప్రభాస్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ తన సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. ఇక ‘ది రాజా సాబ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన టైంలో కూడా ఇలాగే ట్రోలింగ్ నడిచింది. ప్రభాస్ సింహాసనంపై కూర్చున్న లుక్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు మీమ్స్ రాయుళ్ళు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ గ్రాఫిక్స్ తో నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ హ్యాపీ గా ఫీల్ అయ్యేంత వరకు ఈ మూవీ రిలీజ్ కష్టమే అంటున్నారు.

ఆ రెండు రిలీజ్ డేట్లలో కష్టమే

‘ది రాజా సాబ్’ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగా అనౌన్స్ చేశారు. కానీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ ని మేకర్స్ మిస్ చేశారు. దీంతో ఈ మూవీ వాయిదా పడిందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక ఆ తర్వాత మూవీనిజూలై 18 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం మూవీకి గ్రాఫిక్ సమస్యలు కొనసాగుతుండడంతో అప్పటికి కూడా రిలీజ్ అవుతుందా అంటే అనుమానమే. కానీ సమ్మర్లో ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ తక్కువ పోవడం గమనార్హం.

‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×