Chhaava Making Video:ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Lakshman utkar)దర్శకత్వంలో.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో రూపొందిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఛావా’. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.0 ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి క్యారెక్టర్ లో రష్మిక ఒదిగిపోయారు ముఖ్యంగా విక్కీ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్న కొంతమంది ఆడియన్స్ కంటతడి పెట్టుకుంటూ ఉండటంతో ఏ రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పించిందో అర్థమవుతుంది.
విక్కీ శిక్షణ వీడియో షేర్ చేసిన మేకర్స్..
నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి జోరు మీదున్న ఈ సినిమా నుంచి తాజాగా చిత్ర బృందం “ది మేకింగ్ ఆఫ్ ఏ వారియర్ కింగ్ ” అనే పేరుతో ఛావా మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసింది. ఇకపోతే చిత్రబృందం అభిమానులతో పంచుకున్న ఈ వీడియోలో విక్కీ కౌశల్ ఈ పాత్ర కోసం ఎంత కష్టపడ్డారో మనం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టి గుర్రపు స్వారీలో విక్కీ కౌశల్ ఎన్నో మెలుకువలు నేర్చుకోవడం జరిగింది. నిత్యం చాలా కష్టపడుతూ సాధన చేశాడు. ఇక ఈ సినిమాలో శంభాజీ మహారాజుగా కనిపించడానికి విక్కీ కౌశల్ ప్రత్యేకంగా ఆరు నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నారట. అంతేకాదు కత్తి సాములో నేర్పరి అయిన రాజు కత్తి పడితే ఎలా యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి కత్తిసాములో విక్కీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
రోజులో ఎనిమిది గంటలు శిక్షణ కోసం కేటాయింపు..
ఆ యుద్ధంలో కత్తితోపాటు డాలు, చాకు, బల్లెం ఎలా ఉపయోగించాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ల సూచనల మేరకు అవసరమైన శిక్షణ తీసుకొని ఈ సినిమా కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. రోజులో 6 నుంచి 8 గంటలు కేవలం శిక్షణ కోసమే కేటాయించారట విక్కీ.అంతే కాదు రోజు శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్ళాక ఆయన శరీరంపై ఏదో ఒకచోట ఒక చిన్న గాయమైన కనిపిస్తూ ఉండేదట. ముఖ్యంగా శంభాజీ పాత్ర కోసం సన్నద్ధం కావడం వల్ల తనలో తన జీవితంలో ఎంతో క్రమశిక్షణ అలవడిందని కూడా విక్కీ చెప్పుకొచ్చాడు.మహారాజుగా దృఢమైన శరీరంతో కనిపించడానికి దాదాపు 100 కేజీల వరకు బరువు కూడా పెరిగారట.ఇలా బరువు పెరగడానికి కూడా జిమ్ లో ఎంతో శ్రమించారట విక్కీ..మొత్తానికైతే ఈ పాత్ర కోసం ఆయన పడ్డ కష్టానికి అద్భుతమైన ఫలితం లభించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు హిస్టారికల్ మూవీ గా వచ్చిన ఈ సినిమాకి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా విక్కీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా ఈ సినిమా నిలిచిందని సమాచారం.