YCP: ఉదయం నుంచి ట్రూత్ బాంబ్ అంటూ వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదని, చివరికి వైసీపీ విడుదల చేసిన ట్రూత్ బాంబ్ తుస్సుమన్నదంటూ టీడీపీ క్యాడర్ కామెంట్స్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి సంచలన విషయం వెల్లడి కానుందని ముందుగానే ప్రకటించారు. కరెక్ట్ గా ఏడు గంటలకు వైసీపీ ట్విట్టర్ ఖాతా నుండి.. ఉదయం జగన్ చెప్పిన మాటలే మరలా రిపీట్ చేస్తూ ట్రూత్ బాంబ్ అంటూ విడుదల చేశారని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం మాజీ సీఎం జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. విజయవాడ జైలు వద్దకు చేరుకున్న జగన్, వంశీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించి వంశీని అరెస్టు చేశారని, సత్య వర్ధన్ ను వంశీ బెదిరించిన దాఖలాలు లేవంటూ జగన్ తేల్చి చెప్పారు. అయితే వంశీని జగన్ ములాఖత్ ద్వారా కలవకముందే, సాయంత్రం ఏడు గంటలకు ట్రూత్ బాంబ్ విడుదల చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది.
ఆ ట్రూత్ బాంబ్ ద్వారా చెప్పిన విషయాలలోకి వెళితే.. వంశీ అరెస్ట్ లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని, గన్నవరం కేసులో అన్ని కట్టు కథలు, కల్పితాలు, తప్పుడు సాక్షాలు, అక్రమ అరెస్టులు అంటూ విమర్శించారు. కోర్టు ముందు సత్య వర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ అందుకు నిదర్శనమని, చంద్రబాబు సర్కార్ కుట్రకు సత్య వర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఘటన జరిగిన సమయంలో సత్య వర్ధన్ అక్కడ లేడని, టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం తన వద్ద సాక్షి సంతకం తీసుకున్నట్లు సత్య వర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ట్రూత్ బాంబ్ లో పేర్కొన్నారు. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కోర్టులో సత్య వర్ధన్ వెల్లడించినట్లు, చివరగా సత్యమేవ జయతే అంటూ వైసీపీ ట్రూత్ బాంబ్ వదిలింది.
అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏమాత్రం ప్రమేయం లేని వంశీని హఠాత్తుగా నిందితునిగా చేర్చి అరెస్ట్ చేశారని, ఇదంతా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్ట్ అని స్పష్టంగా తెలుస్తోందని వైసీపీ ట్వీట్ చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా టీడీపీ నేతలు ఏకంగా కోర్టును కూడా మోసం చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో గాయపడిన సీఐ కనకారావు ఎస్సీ కాదని కోర్టుకు తెలిపిన టీడీపీ ప్రభుత్వం, ఆయన ఎస్సీ వర్గానికి చెందినవారే అని సాక్షాత్తు తహసీల్దార్ కోర్టుకు ఆధారాలు అందజేశారన్నారు. గతంలో వల్లభనేని వంశీని రెచ్చగొడుతూ విభేదాలకు ఆజ్యం పోసింది టీడీపీ నేత పట్టాభి అంటూ, నాటి ఎమ్మెల్యేను పట్టుకుని అవతలకు విసిరేస్తాను అంటూ టీడీపీ కార్యాలయంలోనే పట్టాభి దురుసు ప్రకటనలు చేసి తగాదాను రాజేశారని టీడీపీ నేత పట్టాభిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Also Read: Selfie with YS Jagan: జగనన్నా అంటూ చిన్నారి భావోద్వేగం.. ఆ ఒక్క సెల్ఫీతో జనం మనసు గెలిచేశాడుగా!
దీనిపై టీడీపీ నాయకులు.. ఉదయం నుండి ట్రూత్ బాంబ్ అంటూ ప్రచారం చేసి చివరకు ఉదయం జగన్ చెప్పిన మాటలనే రిపీట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాంబు తుస్సుమందని, మరలా ట్రూత్ బాంబ్ అంటూ పోస్ట్ చేయొద్దని మరికొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందుగానే టీడీపీ విడుదల చేసిన వీడియోతో ఖంగుతిన్న వైసీపీ, జగన్ మాటలను ఉచ్చరిస్తూ ట్వీట్ వదిలిందని, ఆ సీసీ ఫుటేజ్ కి వైసీపీ సమాధానం ఏమిటంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు, మొత్తం మీద వైసీపీ ఏదో విడుదల చేస్తుందని అటెన్షన్ లో ఉండగా, చివరకు పాత చింతకాయ పచ్చడి వదిలారంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓ వైపు టీడీపీ వీడియో, మరో వైపు వైసీపీ ట్రూత్ బాంబ్ లు వదలగా, ఇరు పార్టీల సోషల్ మీడియా పేజీలు మాత్రం బిజీగా మారాయి.
💣 Truth Bomb 💣
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
– గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
– కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం
– చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025