BigTV English

Chhaava: క్లైమాక్స్ లో యువకుల వెటకారం.. తగిన బుద్ధి చెప్పిన ఆడియన్స్..!

Chhaava: క్లైమాక్స్ లో యువకుల వెటకారం.. తగిన బుద్ధి చెప్పిన ఆడియన్స్..!

Chhaava: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడైన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా గత నెల అనగా ఫిబ్రవరి 14న విడుదలైన చిత్రం ఛావా(Chhaava).. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ వసూలు చేస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ఈ సినిమా గురించి ప్రశంసించారు అంటే, ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Lakshman utkar) దర్శకత్వంలో విక్కీ కౌశల్ (Vicky kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలోని సన్నివేశాలకు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి.. థియేటర్లలోనే ఆడియన్స్ తగిన బుద్ధి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం


ఛావా మూవీ క్లైమాక్స్ లో ఆకతాయిల హేళన కామెంట్స్..

ముంబైలోని కోపార్ ఖైరానే అనే ప్రాంతం నుండి వచ్చిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలాజీ మూవీ ఫ్లెక్స్ లో ఛావా సినిమా చూస్తున్న కొంతమంది యువకులు.. నవ్వుతూ, జోకులు వేస్తూ, వెటకారాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దాంతో ఆ కుర్రాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు గుండెల్ని పిండేసేలా ఉంటాయి. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ ను ఔరంగజేబు ఎంత క్రూరంగా హింసించాడో చూపిస్తుంటే, ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశభక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అలాంటి సన్నివేశాలు వస్తుంటే ఒక ఐదుగురు కుర్రాళ్ళు మాత్రం నవ్వుతూ , వెటకారంగా కామెంట్లు చేశారు. దీంతో అక్కడే వున్న కొంతమంది ఆడియన్స్ మండిపడ్డారు. సినిమా అయిపోగానే వాళ్లకు తగిన బుద్ధి చెప్పారు.


తగిన బుద్ధి చెప్పిన ఆడియన్స్..

ఆ కుర్రాలను బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి “ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి జై”అని గట్టిగా నినాదాలు చేయమని చెప్పారు. మొదట ఒక యువకుడు..” నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కి క్షమాపణలు చెబుతున్నాను అని, మరాఠీ భాషలో చెప్పబోయాడు. కానీ కొంతమంది మేము క్షమాపణలు చెప్పము అని ఎదురు తిరిగారు . దీంతో మిగతా ఆడియన్స్ వారిపై దాడి చేసే ప్రయత్నం చేయగా.. భయపడిపోయిన ఆ కుర్రాళ్ళు..” మేము ఛత్రపతి శంభాజీ మహారాజ్ సినిమా చూస్తూ జోకులు వేసాము. మమ్మల్ని క్షమించండి ” అంటూ తమ తప్పు ఒప్పుకున్నారు. ఇతను మరొక కుర్రాడు “మేము కూడా దేశభక్తి కలిగి ఉన్న వాళ్ళమే..మా కర్మభూమిని మేము ఎలా మర్చిపోతాము? అంటూ కాస్త సీరియస్ గా మాట్లాడారు.అయితే ఈ తతంగం మొత్తాన్ని ఎవరో అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీసి ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేశారు.. మొత్తానికైతే ఇది చూసిన కొంతమంది ఆ కుర్రాళ్లకు తగిన బుద్ధి చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అంత సీరియస్ సన్నివేశం వస్తున్నప్పుడు వీరికి నవ్వేలా వచ్చిందో అంటూ మరికొంతమంది వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×