MERS CoV in Saudi : కరోనా వ్యాప్తి నుంచి ప్రపంచం కోలుకున్నా.. ఏదొక మూల మళ్లీ దాని విజృంభణ ఆందోళనకు గురయ్యేలా చేస్తుంది. సౌదీలో వచ్చిన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా (MERS Covid) కేసులు మూడు నమోదవ్వగా.. ఒక వ్యక్తి మరణించాడు. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్య ఈ ఘటన జరగగా తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాధి బారిన పడివారి వయసు 56-60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఇప్పటికే బాధితులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో సౌదీలో మొత్తం 5 మెర్స్ కరోనా కేసులు నమోదయ్యాయని, వారిలో ఇద్దరు మరణించారని తెలిపింది.
MERS అనేది MERS కరోనావైరస్ (CoV) వల్ల కలిగే వైరల్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్. ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వీరిలో 36 శాతం మంది మరణించారు. ఇది ఒంటెల ద్వారా సోకుతుందని, ఈ వైరస్ వ్యాప్తికి సహజ మూలంగా ఉంటుందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డ్రోమెడరీ ఒంటెల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోకే వ్యాధి అయినా.. ఒక మనిషి నుంచి మరొకరికి కూడా సోకుతుందని పేర్కొంది. MERS-Cov ని అరికట్టేందుకు ఇప్పటి వరకూ నిర్థిష్టమైన టీకా అందుబాటులోకి రాలేదు. కొన్ని కంపెనీలు టీకాలను తయారు చేస్తున్నాయని, చికిత్స కూడా కనుగొంటున్నట్లు చెప్పారు.
2012 నుంచి ఏప్రిల్,2024 వరకూ సౌదీ అరేబియాలో మెర్స్ కోవిడ్ కేసులు 2204 నమోదవ్వగా.. 860 మంది మరణించారు. 27 దేశాల నుంచి 2613 కేసులు నమోదవ్వగా 941 మరణాలు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మిడిల్ ఈస్ట్ దక్షిణ కొరియాలో 2015 మే లో ఒక వైరస్ విజృంభించింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల సౌత్ కొరియాలో 185 మంది చైనాలో 38 మంది మరణించారు. అప్పడు వ్యాపించిన వైరస్.. మెర్స్ లక్షణాలనే పోలి ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.