BigTV English

Shinchan House : కోట్లు ఖర్చు పెట్టి ‘షిన్ చాన్’ ఇంటిని రియల్ గా నిర్మించిన అభిమాని… ఎక్కడుందంటే?

Shinchan House : కోట్లు ఖర్చు పెట్టి ‘షిన్ చాన్’ ఇంటిని రియల్ గా నిర్మించిన అభిమాని… ఎక్కడుందంటే?

Shinchan House : జపాన్ యానిమే షిన్ చాన్ (Shinchan) గురించి తెలియని యానిమే లవర్ ఉండడంటే అతిశయోక్తి కాదు. తెరపై ఈ అల్లరి పిల్లాడు చేసే కొంటె పనులకి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అభిమానులే. స్క్రీన్ పై షిన్ చాన్ ను ఈ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఈ యానిమే ట్రెండింగ్ లోనే ఉంటుంది. అయితే తాజాగా ఓ అభిమాని షిన్ చాన్ పై తన అభిమానాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ‘బాబోయ్ షిన్ చాన్ కి ఇంత డైహార్డ్ అభిమానులు ఉంటారా?’ అనిపించేలా చేశారు. ఏకంగా షిన్ చాన్ యానిమేలో ఉండే ఇంటిని రియల్ గా నిర్మించి, తన అభిమానాన్ని చాటుకున్నాడు.


షిన్ చాన్ ఇల్లు రియల్ గా…

చైనాలోని బెజీయాంగ్ కు చెందిన జియాంగ్ అనే 21 ఏళ్ల కుర్రాడు ‘షిన్ చాన్’ (Shinchan) ఇంటిని రియల్ లైఫ్ లో నిర్మించడానికి ఏడాదికి పైగా కష్టపడ్డాడు. ఆయన కుటుంబం గొర్రెలను పెంచుతుంది. అయితే ఆ గొర్రెల పెంపకం తన చేతికి వచ్చిన తర్వాత ఆయన తనకున్న పొలం మొత్తాన్ని షిన్ చాన్ ఇంటిని కట్టడానికి కేటాయించాడట. అంతేకాకుండా షిన్చాన్ ఇంటిని నిర్మించడానికి అవసరమైన ప్రత్యేకమైన లైసెన్స్ హక్కులను పొందడానికి చాలా కాలం వెయిట్ చేశాడట. మొత్తానికి అష్ట కష్టాలు పడి షిన్ చాన్ ఇంటిని నిజంగానే నిర్మించి చూపించాడు.


షిన్ చాన్ (Shinchan) తన కుటుంబంతో కలిసి ఉండే ఐకానిక్ ఇంటిని రీ క్రియేట్ చేసి సదరు యానిమే క్యారెక్టర్ పై తనకున్న ఇష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ కుర్రాడు. నలుపు తెలుపు ఇటుకలతో కట్టిన ఆ భవనాన్ని అచ్చు గుద్దినట్టు దింపేశాడు. 2024 జూలైలో ఈ ఇంటిని నిర్మించడం మొదలు పెట్టిన జియాంగ్, ఆ ఇంటిని నిర్మించడానికి కొంచెం ప్రత్యేకమైన సామాగ్రిని ఉపయోగించాల్సి వచ్చిందట. దీంతో ‘షిన్ చాన్’ ఇంటి నిర్మాణ ప్రక్రియ అంతా సులభమేం కాలేదు. దీనిని నిర్మించడానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరికి ఈ ఇల్లు పూర్తి కావడానికి రూ.3.5 కోట్లు ఖర్చయిందట. అయితే ఈ పిల్లాడి పిచ్చి చూసి తిట్టుకోకుండా అతని తల్లి కూడా ఆర్థికంగా సహాయం చేసిందట. ఆ ఇల్లు మొత్తం 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నిర్మించగా, త్వరలోనే అక్కడికి సందర్శకులకు అనుమతిని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

అయితే జియాంగ్ కల ఇంతటితో అయిపోలేదట. ఇప్పటికే ఆయన ‘షిన్ చాన్’ ఫ్యామిలీ వాడే ఓ ప్రత్యేకమైన కారుని రియల్ గా తయారు చేయించుకున్నాడు. అంతేకాకుండా త్వరలోనే ‘షిన్ చాన్’ కిండర్ గార్డెన్ తో పాటు, మొత్తం షిన్ చాన్ ప్రపంచాన్ని యానిమే నుంచి రియల్ వరల్డ్ లోకి దింపే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఈ కుర్రాడు క్రేజీ కదా!

32 ఏళ్ల నుంచి నాన్ స్టాప్ గా…

ఇక షిన్ చాన్ (Shinchan) సిరీస్ దాదాపు 32 ఏళ్ల నుంచి అభిమానులను అలరిస్తోంది. ఈ జపనీస్ యానిమే ఫ్యామిలీ ఎంటర్టైనర్ 1990లో మొదటిసారి కామిక్ గా వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా షిన్ చాన్ ను అభిమానులు ఇష్టపడుతూనే ఉన్నారు. 2009లో షిన్ చాన్ సృష్టికర్త యెషిటో ఉసుయీ కన్నుమూశారు. అయినప్పటికీ ఈ సిరీస్ ఇంకా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×