Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వాహనంలో ఆస్పత్రిలో చేర్పించి మంత్రి మానవీయ హృదయాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం.. మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని హన్మకొండ వస్తున్న క్రమంలో జక్కలొద్ది క్రాస్ రోడ్డు(ఉర్సు గుట్ట) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, పోలీస్ వాహనంలో గాయపడిన ఇద్దరు బాధిత వ్యక్తులను ఆస్పత్రిలో చేర్పించారు.
బాధితులకు మెరుగైన చికిత్సి అందించాలని మంత్రి ఫోన్‌లో ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆపదలో మంత్రి చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకులు అందరూ ఇలా ఉండాలని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Also Read: CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే
అయితే.. ప్రమాదం ఎలా జరిగింది.. ఎంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.