BigTV English

Hit 3 OTT: నాని బ్లడ్ బాత్ మూవీ హిట్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎందులో అంటే.?

Hit 3 OTT: నాని బ్లడ్ బాత్ మూవీ హిట్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎందులో అంటే.?

Hit 3 OTT: నాచురల్ స్టార్ నాని హీరోగా..కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన హిట్ -3 మూవీ మే 1న విడుదలైన సంగతి మనకు తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్లో యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్, వాల్ పోస్టర్ బ్యానర్ హీరో నాని, త్రిపిరనేని ప్రశాంత్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ఈ మూవీ కంటే ముందు విడుదలైన హిట్, హిట్ -2 రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిట్ -3 మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టే నాని నటించిన హిట్ 3 మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమాలో రక్తపాతం కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ నానిని చూసి అభిమానులు థియేటర్లకు ఎగబడ్డారు.. అయితే విడుదలై నెల రోజులు కాకముందే ఈ సినిమా ఓటీటిలోకి వస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది..మరి ఇంతకీ హిట్ -3 మూవీ ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..


ఓటీటిలోకి నాని హిట్ 3..

నాని నటించిన హిట్ 3 మూవీని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు దాదాపు రూ.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.. అయితే ఈ సినిమాని మే 29 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మే 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని వార్తలు రావడానికి కారణం తాజాగా నెట్ ఫ్లిక్స్ లో అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో హిట్-3 మూవీని చేర్చారు. దీంతో హిట్ -3 మూవీ మే 29 స్ట్రీమింగ్ అవుతుంది అంటూ వార్తలు ఊపందుకున్నాయి.. అయితే నెట్లి ఫ్లిక్స్ ఓటిటి వాళ్లు ఈ సినిమాకి సంబంధించిన డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.


హిట్ 3 ఫ్రాంచైజీ కొనసాగింపు..

ఇక హిట్ త్రీ మూవీలో నానితోపాటు హీరో కార్తీ,అడివి శేష్ లు కూడా క్యామియో రోల్స్ పోషించారు.అలాగే హిట్ -4 మూవీలో హీరోగా కార్తి ఫిక్స్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చివర్లో కార్తీ ఎంట్రీ ఉందని తెలుస్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్ వహించిన హిట్-1, హిట్ -2,హిట్ -3 సినిమాలతో పాటు మరో 5 సినిమాలు కూడా ఉంటాయని, అలా టోటల్ గా హిట్ 8 వరకు ఈ ఫ్రాంచైజీ కొనసాగుతుందని స్వయంగా దర్శకుడు శైలేష్ కొలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నాని సినిమాలు :

ఇక నాని మరొకవైపు ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత మరో మలయాళం సినిమాటిక్ యూనివర్స్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇలా ఒకవైపు నాని హీరోగా మరొకవైపు నిర్మాతగా కూడా భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×