Chiranjeevi: రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు మధ్య మంచి సాన్నిహిత్యం ఎప్పుడూ ఉంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా, తరచుగా కలుస్తూ ఉండకపోయినా.. వారి మధ్య సాన్నిహిత్యం అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైనా ఈవెంట్స్‌లో కలిసినప్పుడు ఒకరి గొప్పతనం గురించి మరొకరు చెప్తూ, ఒకరిపై మరొకరి అభిమానాన్ని బయటపెడుతుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అదే చేశారు. ఇటీవల జరిగిన ఒక బుక్ లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి, చంద్రబాబు చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు. అందులో చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. దీంతో టీడీపీ ఫాలోవర్స్ అంతా సంతోషంలో చిరంజీవి చేసిన కామెంట్స్‌ను వైరల్ చేసేస్తున్నారు.
మాటకు కట్టుబడి ఉన్నారు
మంత్రి నారాయణ కుమార్తె శరణి రచయిత్రిగా మారింది. ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ అనే పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం కోసం పలువురు సినీ సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను రంగంలోకి దింపారు మంత్రి నారాయణ. ఆ ఈవెంట్‌లోనే చిరంజీవి, చంద్రబాబు (Chandrababu) కలిశారు. ఎప్పుడు కలిసినా సన్నిహిత్యంగా ఉండే వీరిద్దరూ మరోసారి ఒకరిపై మరొకరి అభిమానాన్ని బయటపెట్టారు. రాజకీయాల్లో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని కాలేజ్ రోజుల నుండి చంద్రబాబు అనుకుంటూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. అప్పటినుండి అనుకున్న దానికే ఆయన కట్టుబడి ఉంటూ అనుకుంది సాధించారని ప్రశంసించారు.
క్రెడిట్ ఆయనకే
రాజకీయాల్లో రాణించిన విషయంలో చంద్రబాబును ప్రశంసించిన చిరంజీవి.. మరొక ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ లాంటి విశ్వ నగరాన్ని నిర్మించిన క్రెడిట్ కూడా చంద్రబాబుకే అందించారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో కొందరు విమర్శకుల నోళ్లు మూతబడ్డాయని టీడీపీ ఫాలోవర్స్ సంతోషిస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగర నిర్మాణానికి కారణం తామే అంటూ ఎవరికి వాళ్లు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చిరంజీవి లాంటి స్టార్ సైతం ఈ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అని చెప్పడం ఆయన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది. ఇక చంద్రబాబు కూడా చిరంజీవి చేసిన సామాజిక సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనను ప్రశంసించారు.
Also Read: ‘ఎమర్జెన్సీ’ వల్ల కంగనాకు తప్పని కష్టాలు.. మరో కేసు నమోదు
ధృడమైన సంకల్పం
‘‘చిరంజీవి (Chiranjeevi) చాలా సంకల్పంతో ముందుకెళ్లారు. నేను నటుడిని కావాలి అనే సంకల్పం ఆయన మైండ్‌లో పడింది. అప్పటినుండి ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకెళ్లారు. తన గోల్‌ను రీచ్ అయ్యేవరకు నిరంతరం పనిచేశారు. ఎన్‌టీఆర్ సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి సినిమాల్లో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు. ఎన్‌టీఆర్ తర్వాత చిరంజీవినే ఒక మహానటుడిగా తయారయ్యాడు. ఆ అవకాశం ఆయనకు దక్కింది. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయనను తరచుగా కలిసేవాడిని. అప్పుడే ఆయనలో చాలా ఆలోచనలు ఉండేవి. నేను సమైఖ్యాంధ్రకు సీఎంగా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ పెడతాను, కొంత స్థలం ఇవ్వండి అని అడిగారు. సామాజిక సేవ గురించి సినిమా యాక్టర్లు మామూలుగా ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి’’ అన్నారు చంద్రబాబు.