BigTV English

Yograj Singh : అర్జున్ టెండూల్కర్‌ను నా కొడుకు గేల్‌లా మారుస్తాడు

Yograj Singh :  అర్జున్ టెండూల్కర్‌ను నా కొడుకు గేల్‌లా మారుస్తాడు

Yograj Singh : టీమిండియాఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్ లో కొనసాగుతున్నాడు. ఇతన్ని మెగా వేలంలో రూ.30లక్షలకు కొనుగోలు చేశారు. అర్జున్ టెండూల్కర్ ను తన కుమారుడు యువరాజ్ సింగ్ కి అప్పగిస్తే.. క్రిస్ గేల్ లా తయారు చేస్తాడని ఆయన తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలర్. మాజీ క్రికెటర్ అయిన యోగ్ వద్ద అర్జున్ 2022లో కొద్ది రోజుల పాటు శిక్షణ పొందాడు. అప్పటి విశేషాల గురించి యోగ్ రాజ్ తాజాగా మాట్లాడారు.


Also Read :  SKY on Abhishek sharma : ఇదేం దౌర్జన్యం..మళ్ళీ అభిషేక్ శర్మ జేబులు చెక్ చేసిన SKY

ఎక్కువగా బ్యాటింగ్ పై దృష్టి సారించాలని కోరినట్టు వెల్లడించారు. తన కుమారుడికి శిక్షణ ఇవ్వాలని సచిన్ యువరాజ్ సింగ్ ని కోరినట్టయితే మరో క్రిస్ గేల్ గా మారే అవకాశం ఉందని యోగ్ రాజ్ పేర్కొన్నాడు. బౌలింగ్ పై తక్కువ దృష్టి పెట్టి.. బ్యాటింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని తాను అర్జున్ కి చెప్పాను. సచిన్ తన కుమారుడి విషయం గురించి యువరాజ్ తో మాట్లాడాలన్నారు. అర్జున్ ని యువరాజ్ వద్ద మూడు నెలల పాటు శిక్షణ పొందితే అతను తదుపరి క్రిస్ గేల్ అవుతాడని పందెం వేస్తున్నట్టు తెలిపాడు. ఒక ఫాస్ట్ బౌలర్ తరుచుగా ఒత్తిడికి గురైతే అంత సమర్థవంతంగా బౌలింగ్ చేయలేడని.. అందుకే అర్జున్ టెండూల్కర్ కి యువరాజ్ కి అప్పగించాలని వివరించాడు యోగ్ రాజ్. 


ఈ మధ్య కాలంలో దేశవాలీ క్రికెట్ లో అర్జున్ టెండూల్కర్ పెద్దగా ఫామ్ లో  కనిపించడం లేదు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 40 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మూడు మ్యాచ్ లలో నాలుగు వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలలో మూడు ఇన్నింగ్స్ లో కలిపి 51 రన్స్ చేశాడు. బౌలింగ్ మాత్రం రాణించాడు. నాలుగు మ్యాచ్ లలో 18.18 యావరేజీతో 16 వికెట్లు తీశాడు. 2023 ముంబై తరపున ఐపీఎల్ లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడాడు. ఈ సీజన్ లో అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.

అర్జున్ టెండూల్కర్ ని తీసుకున్నప్పటికీ ముంబైలో అతని ఛాన్స్ ఎందుకు దక్కడం లేదని సచిన్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే అర్జున్ టెండూల్కర్ కంటే మెరుగైన ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ లో ఉండటం వల్లనే అతడినీ తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.  మరోవైపు అర్జున్ టెండూల్కర్ టీమిండియా ఎంట్రీ అసాధ్యంగానే కనిపిస్తోంది. తండ్రి వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. కానీ ఆయన కుమారుడు ఇంకా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు తంటాలు పడుతూనే ఉన్నాడు. సచిన్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయితే.. కుమారుడు మాత్రం ఆలౌరౌండర్. ఈ ఆల్ రౌండర్ ఇండియా టీమ్ లోకి ఎప్పుడూ ఎంట్రీ ఇస్తాడోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

Big Stories

×