Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై ఎప్పటికప్పుడు నెగిటివిటీ రావడం అనేది చాలా కామన్‌గా మారిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతుంది కంగనా. ఇక రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమాల్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు ఈ సీనియర్ బ్యూటీ. అయినా కూడా కొన్నేళ్ల పాటు కష్టపడి ఇండియాలో జరిగిన ఎమర్జెన్సీ ఆధారంగా సినిమా తెరకెక్కించింది. దానికి టైటిట్ కూడా ‘ఎమర్జెన్సీ’ (Emergency) అనే ఫిక్స్ చేసింది. అయితే ఈ మూవీ ప్రారంభించినప్పటి నుండి రిలీజ్ వరకు కంగనాకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా దీనికి కష్టాలు తప్పడం లేదు.
యాక్షన్ తీసుకుంటా
1975లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఇండియాలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని ఆధారంగా ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. అందులో సీనియర్ జర్నలిస్ట్ కూమీ కపూర్ రాసిన పుస్తకం పర్ఫెక్ట్ అని చాలామంది రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే అదే పుస్తకాన్ని ఆధారంగా కంగనా కూడా ‘ఎమర్జెన్సీ’ మూవీ తెరకెక్కించింది. అందులో తను ఇందిరా గాంధీ పాత్రలో నటించడం మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. అయితే పుస్తకంలో తను రాసిన నిజాలను సినిమాలు మార్చి చూపించిందని, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించిందని కంగనాపై, మణికర్ణిక ఫిల్మ్స్‌పై, నెట్‌ఫ్లిక్స్‌పై యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యింది కూమీ కపూర్.
అగ్రిమెంట్‌లో ఏముందంటే.?
తను రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించి అని చెప్తూనే మేకర్స్ అంతా అందులో ఉన్న నిజాలను మార్చి చూపించారని ఆరోపణలు చేసింది కూమీ కపూర్. ‘‘నా కూతురు ఒక లాయర్. అందుకే తను చెప్పినదాని ప్రకారం నేను క్లాజ్‌ల ఆధారంగా కేసు నమోదు చేశాను. ఒక సినిమాను తెరకెక్కించడానికి క్రియేటివ్‌గా ఆలోచించే హక్కు మేకర్స్‌కు ఉంటుంది. కానీ ప్రజలందరికీ తెలిసి, వారి కళ్ల ముందు ఉన్న నిజాన్ని మార్చే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. పైగా నా పేరు గానీ, నా పుస్తకం పేరు గానీ నా అనుమతి లేకుండా ప్రమోషన్స్ కోసం ఉపయోగించకూడదని అగ్రిమెంట్‌లో ముందు నుండి ఉంది’’ అంటూ సీరియస్ అయ్యింది కూమీ కపూర్ (Coomi Kapoor).
Also Read: అయ్యో పాపం.. చిన్న వయసులోనే ఇంత భాధను అనుభవిస్తుందా.?
వాట్సాప్ చాటింగ్ లీక్
‘‘నేను గోవాలో ఉండడం వల్ల అప్పుడు ఎమర్జెన్సీ సినిమా చూడలేదు. వాళ్లు కాంట్రాక్ట్‌ను ఫాలో అవుతారని నేను నమ్మాను. కానీ వాళ్లు ఇప్పటికీ ఆ సినిమాను నా పుస్తకం ఆధారంగానే తెరకెక్కించామని అంటున్నారు. నేను ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్‌కు రెండు లీగల్ నోటీసులు పంపాను. కానీ వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నా పుస్తకంలో ఉన్న సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది అని చెప్పడం నేను కొంతవరకు ఒప్పుకుంటాను. కానీ మొత్తం సినిమా నా పుస్తకం ఆధారంగా తెరకెక్కింది అంటే మాత్రం ఒప్పుకోను’’ అని తేల్చి చెప్పింది కూమీ కపూర్. పైగా ముందు నుండే తన కండీషన్స్‌కు మేకర్స్ ఒప్పుకున్నారంటూ వాట్సాప్ చాట్‌ను కూడా బయటపెట్టింది.