BigTV English

Vishwambhara: గ్రాఫిక్స్ టీమ్ ని చేంజ్ చేసిన మేకర్స్.. ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా..?

Vishwambhara: గ్రాఫిక్స్ టీమ్ ని చేంజ్ చేసిన మేకర్స్.. ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా..?

Vishwambhara..మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు విశ్వంభర(Vishwambhara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘బింబిసార’ సినిమాతో కళ్యాణ్ రామ్ (Kalyanram) కి మంచి కం బ్యాక్ అందించి, భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassistha mallidi) దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం ఇది. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి, త్రిష(Trisha ) కునాల్ క(Kunal Kapoor), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఆషికా రంగనాథ్(Ashika Ranganath) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. చిరంజీవికి అనారోగ్య సమస్యల కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా వేశారు. ఇక మే నెలలో సమ్మర్ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


గ్రాఫిక్స్ టీం ని చేంజ్ చేసిన విశ్వంభర మేకర్స్..

మరొకవైపు ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కోకూడదు అనే నేపథ్యంలోనే చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘ఆది పురుష్’ సినిమా గ్రాఫిక్స్ పరంగా బాగోలేదని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి విమర్శలు తన సినిమాకు రాకూడదని జాగ్రత్తగా పడుతున్న చిరంజీవి, అందులో భాగంగానే తన సినిమాకు పనిచేస్తున్న గ్రాఫిక్స్ టీం ని చేంజ్ చేసినట్లు సమాచారం.


కల్కి డైరెక్టర్ ఆధ్వర్యంలో..

అయితే ఇప్పుడు చిరంజీవి ‘కల్కి’ సినిమాకి గ్రాఫిక్స్ అందించిన టీంతో ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) పర్యవేక్షణలోనే ఈ గ్రాఫిక్స్ చేస్తున్నారట. అంతేకాదు ఈ బాధ్యతను చిరంజీవి స్వయంగా నాగ్ అశ్విన్ కి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గత ఏడాది కల్కి సినిమాతో ఒక సంచలనం సృష్టించారు. భవిష్యత్తులో కలియుగం అంతమైతే కల్కి జన్మించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? అనే విషయాన్ని స్పష్టంగా ఊహాగానాలతో చూపించడం జరిగింది. ఈ సినిమా గ్రాఫిక్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పిల్లలు నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు సినిమాకి నీరాజనాలు పట్టారు. అందుకే ఇలాంటి నిపుణుల పర్యవేక్షణలో తమ సినిమాకు గ్రాఫిక్స్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆ అనుబంధమే ఇలా..

ఇకపోతే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ (Ashwini Dutt) తో చిరంజీవికి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి కూడా.. అంతే కాదు బ్లాక్ బాస్టర్ సినిమాలను కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి.. నాగ్ అశ్విన్ కి .. అశ్వినీ దత్ అల్లుడు కావడంతో కాస్త చొరవ తీసుకొని ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ పై చిరంజీవి పెట్టుకున్న నమ్మకానికి నాగ్ అశ్విన్ ఏ విధంగా తనను తాను ప్రూవ్ చేసుకుంటారో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×