Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున జీవితం తెరిచిన పుస్తకమే. ఏఎన్నార్ నటవారసుడిగా విక్రమ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హీరో అనిపించుకున్న నాగ్.. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. ముఖ్యంగా లవ్ స్టోరీస్ కు నాగ్ పెట్టింది పేరు. అందుకే ఆయనను మన్మధుడు అని పిలుస్తారు. ప్రయోగాలు అయినా.. భక్తి పాత్రలు అయినా నాగ్ తరువాతే ఎవరైనా.. శివ లాంటి సినిమా చేయాలన్నా ఆయనే.. అన్నమయ్య లాంటి సినిమా చేయాలన్నా ఆయనే. ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి.. కింగ్ గా నిలబడ్డాడు నాగ్.
సినిమాల విషయం పక్కన పెడితే.. నాగార్జున కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీతో 1984 లో వివాహం జరిపించారు ఏఎన్నార్. వీరికి అక్కినేని నాగచైతన్య జన్మించాడు. ఇక పెళ్లి తరువాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 1990 లో వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోయారు. చైతన్య మాత్రం దగ్గుబాటి కుటుంబంలోనే పెరిగాడు.
ఇక లక్ష్మీతో విడాకుల అనంతరం.. నాగ్, హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు. కిరాయి దాదా సినిమాతో అమల తెలుగుకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం లాంటి సినిమాల్లో వీరు జంటగా కనిపించారు. ఇన్ని సినిమాల్లో కలిసి నటించే సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. 1992 లో నాగార్జున- అమల వివాహం చాలా సింపుల్ గా జరిగింది. వీరికి అక్కినేని అఖిల్ జన్మించాడు.
Odela 2: మహాకుంభమేళాలో తమన్నా మూవీ టీజర్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన మిల్కీ బ్యూటీ
అయితే నాగ్ – అమల పెళ్ళికి ఏఎన్నార్ ఒప్పుకోలేదని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ” అమలకు మొదట నేనే ప్రపోజ్ చేశాను. కానీ, అలా ప్రపోజ్ చేయడానికి ఆరేళ్ళు పట్టింది. నేను ప్రపోజ్ చేసినప్పుడు.. ఆనందంతో అమల భోరున ఏడ్చేసింది. ఇంట్లో చెప్పినప్పుడు నాన్న ఒప్పుకోలేదు. బయట ఏమనుకుంటారు.. విడాకులు ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటే నాన్నకు ఎందుకో నచ్చలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్. ఫ్యామిలీ బాండింగ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు.
నాన్నకు చాలా లేట్ ఏజ్ లో పెళ్లి అయ్యింది. పిల్లదొరకలేదు అంట. సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వం అని చెప్పేవారట. ఆ కసితో నాన్న ఎవరితో ఇంకో ఎటాచ్ మెంట్ పెట్టుకోలేదు. ఈ రూల్స్ ఇవి అని గీత గీసేశేవారు. కొన్ని ఆయనకు ఇష్టం ఉన్నా కూడా బయట ఇమేజ్ కోసం చేసేవారు కాదు. ఎందుకంటే అక్కినేని కుటుంబం పై రాంగ్ ఇమేజ్ రాకూడదని ఎప్పుడు కోరుకునేవారు. ఆ తరువాత నా హ్యాపీ నెస్ చూసి అయన కూడా సంతోషించారు.
అమలతో గొడవలు అంటే.. ప్రపంచంలో ఉన్న భారమంతా ఆమె మోస్తుంది అనుకుంటుంది. దాన్నంతా ఇంటికి తీసుకొచ్చి పెడుతుంది. అదొక్కట్టే తప్ప ఇంకేమి లేదు. షూటింగ్ చేసి ఇంటికి వస్తే.. సేవ కార్యక్రమాలు అంటూ ఢిల్లీ వెళ్తున్నా.. వరంగల్ వెళ్తున్నా అంటుంది. కానీ, ఆమె చేసే వర్క్ చాలా గర్వంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఎప్పటివో అయినా.. మరోసారి నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.