Congress on BRS Party: వస్తాను.. వస్తున్నాను అంటూ ఊరించిన కేసీఆర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. కేసీఆర్ రాక కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిందో లేదో కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రం బిగ్ షాక్ తగిలిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ ఇలా కామెంట్స్ చేయడం వెనుక కూడా పెద్ద కారణమే ఉందట. కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం కేసీఆర్ వచ్చారు.. కేటీఆర్ ను పక్కకు నెట్టేశారంటూ వైరల్ చేస్తోంది. అంతేకాదు టీపీసీసీ మీడియా ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా ఇదే రీతిలో కేసీఆర్ రాకపై కామెంట్స్ చేస్తూ.. సంచలన ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. నిన్నటి వరకు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కార్యవర్గ సమావేశానికి రావడంతో కాస్త హంగామా చేసేందుకు పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ కేసీఆర్ మాత్రం కార్యకర్తలపై అసహనం చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
అసలే అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు పార్టీకి దక్కక పోవడంతో అసహనంతో ఉన్న కేసీఆర్, రావడం రావడమే కేటీఆర్ కు బిగ్ షాకిచ్చారని పీసీసీ మీడియా ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేటీఆర్ వల్ల పార్టీ బలం పుంజుకోవడం బదులు, పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనకు కేసీఆర్ వచ్చారని ఆ ట్వీట్ సారాంశం. సామా ట్వీట్ లో ఏముందంటే.. కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ ఉత్త డల్లుగా నిలిచారని, ఇదే విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. తన కుమారుడిపై కోపం చూపలేక, కార్యకర్తలపై చూపినట్లు సామా విమర్శించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్.. వర్క్ మానేసి పార్టీని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే కేసీఆర్ పార్టీ బలోపేతం భాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారన్నారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించిన మాజీ కేసీఆర్, తన కుమారుడిని నమ్మక అల్లుడు హరీష్ రావుకు భాద్యతలు అప్పగించడమే దీనికి నిదర్శనమని సామా విమర్శించారు. సోషల్ మీడియాతో అవాస్తవాలు ప్రచారం చేయడంలో ముందుండే కేటీఆర్ టీం, హరీష్ రావుకు భాద్యతలు అప్పగించడంపై ఖంగుతిందని వాట్ నెక్స్ట్ అంటూ ఆలోచనలో పడ్డట్లు ఆయన ట్వీట్ చేశారు.
Also Read: KCR: సీఎం అంటూ నినాదాలు.. కార్యకర్తలపై కేసీఆర్ అసహనం, ఉప ఎన్నికలు వస్తాయంటూ..
సామా చేసిన ట్వీట్ ను బట్టి కేటీఆర్ కు హోదా ఒక్కటే మిగిలిందని, వర్క్ మొత్తం హరీష్ రావు మోయాల్సిన పరిస్థితి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బయటకు వస్తున్నా అంటూ పార్టీ సమావేశానికి వచ్చిన కేసీఆర్.. తన కుమారుడికి ఒక్క నిర్ణయంతో బిగ్ షాక్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా, కేటీఆర్ ఈ ట్వీట్ కి ఎలా స్పందిస్తారో కానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.
కేసీఆర్ దృష్టిలో టిల్లు ఉత్త డల్లు…కొడుకు మీద కోపం కార్యకర్తల మీద చూపించిన వైనం.
వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నాట్ వర్కింగేనా??
కొడుకు ముందుంటే పార్టీ కూలుడే అని భావించినట్టున్నాడు!!పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించి కొడుకు టిల్లుని నమ్మక అల్లుడు అగ్గిపెట్టె @BRSHarish కి… pic.twitter.com/9lyc6mvUV2
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) February 19, 2025