BigTV English
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ కూతురు సుస్మిత హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా.. ఏ చిత్రం అంటే..?

Chiranjeevi : మెగాస్టార్ కూతురు సుస్మిత హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా.. ఏ చిత్రం అంటే..?

Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ). ఓ మెట్టు ఎక్కుతూ..అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన , మెగాస్టార్ గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.


మెగా ఆడపడుచులు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరా..?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి , చాలామంది మంచి సక్సెస్ అయ్యారు కూడా.. అయితే మెగా ఆడపడుచులు మాత్రం ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. మెగా ఆడపడుచులు అనగానే ముందుగా మనకు నాగబాబు కూతురు నిహారిక (Niharika)గుర్తుకొస్తుంది. యాంకర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పెళ్లి , విడాకులు అంటూ వ్యక్తిగత జీవితానికి కొంచెం స్పేస్ ఇచ్చిన నిహారిక , ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తాజాగా నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తూనే , మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా మారింది నిహారిక.


క్యాస్టింగ్ డిజైనర్ గా కొనసాగుతున్న మెగాస్టార్ పెద్ద కూతురు..

అయితే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత (Susmita ) కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె క్యాస్టింగ్ డిజైనర్ గా కొనసాగుతోంది. అంతేకాదు ఇటీవలే నిర్మాతగా కూడా స్థిరపడింది. సుస్మిత కూడా సినిమాలు, వెబ్ సిరీస్లో నిర్మిస్తూ ఇండస్ట్రీలో నిర్మాతగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గురించి తెలియని విషయం ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే సుస్మిత హీరోయిన్గా నటించారని సమాచారం.

హీరోయిన్ గా సుస్మిత నటించిన చిత్రం..

Chiranjeevi : Did you know that Megastar's daughter Sushmita has acted as the heroine.. Which film is that..?
Chiranjeevi : Did you know that Megastar’s daughter Sushmita has acted as the heroine.. Which film is that..?

నిజానికి సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలకున్న ప్రతిసారి కూడా ఏదో కాటంకం ఎదురుకోవడంతో చిరంజీవి తన ఆలోచనను విరమించుకున్నారట. కానీ హీరోయిన్ గా మాత్రం ఒక సినిమాలో నటించారని తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath)దర్శకత్వంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా ,సుస్మిత హీరోయిన్ ఒక సినిమా ప్రకటించారట. ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల కాలేదని సమాచారం. ఒకవేళ ఇదే సినిమా గనుక విడుదలై వుంటే సుస్మిత లైఫ్ మరో విధంగా ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ ఒక్క సినిమా సుస్మిత లైఫ్ నే మార్చేసేది అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×