Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ రూపొందిస్తోన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా సినీ వర్గాల సమాచారం మేరకు ‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా ఫిక్స్ చేశారు దర్శకుడు బాబీ. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావటంతో సినిమా రిలీజ్‌కు అన్నీ మార్గాలు సుగమమైనట్లే.
కొత్త సంవత్సరం సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఎంటైర్ యూనిట్‌కు గ్రాండ్ పార్టీనిచ్చారు. రవితేజ, డైరెక్టర్ బాబీ సహా ఎంటైర్ టీమ్ ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. పార్టీ అనంతరం టీమ్ అందరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్ హియర్ ఈజ్ ది పార్టీ అని కొటేషన్‌తో పాటు.. ‘వాల్తేరు వీరయ్య’ లోని పాట బాస్ పార్టఈ సాంగ్‌లో వచ్చే ‘వేర్ ఈజ్ ది పార్టీ ’ పాటను షేర్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ లో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర వ్యవధి 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుంచి త్వరలోనే ‘నీకు అందమెక్కువ నాకేమో తొందరెక్కువ..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు.