E-Paper
Advertisement

Golden Globe Awards : లాస్ ఏంజిల్స్‌కు RRR టీమ్‌

Golden Globe Awards : లాస్ ఏంజిల్స్‌కు RRR టీమ్‌
Advertisement

Golden Globe Awards : సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ RRR. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. అదే క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు సాంగ్‌.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో నామినేట్ అయ్యింది.

RRR సినిమాలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా.. కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఇంటర్నేష‌న‌ల్ ఈవెంట్స్‌లో RRR సినిమా ప‌లు అవార్డుల‌ను ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అదే ఊపులో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా RRR ఎంపింకైంది. కాబ‌ట్టి రామ్ చ‌ర‌ణ్‌.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి కొన్ని రోజులే ఉండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఓ ఉత్కంఠ‌త నెల‌కొంది. ఈ కార్య‌క్ర‌మంలో RRR ప్రెస్టీజియ‌స్ అవార్డుల‌ను ద‌క్కించుకుంటుందని ఎంటైర్ ఇండియా ఎదురు చూస్తుంది.

Advertisement

ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి RRR ఎంపికైన ఇదే అవార్డుల కేట‌గిరిలను మార్చిలో జ‌ర‌గ‌బోయే అకాడ‌మీ అవార్డ్స్‌లోనూ గెలుచుకుంటుంద‌ని అందుకు ఇది ఓ హింట్ అని అనుకోవ‌చ్చు. త్వ‌ర‌లోనే ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ఘ‌నంగా జ‌ర‌గ‌బోయే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో RRR టీమ్‌తో పాటు సినీ తారాలోకమంతా హాజ‌రై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×