BigTV English

vishvambhara : ‘ విశ్వంభ‌ర ‘ లోనూ వేలు పెట్టిన చిరు .. మరో ఆచార్య అవుతుందా ?

vishvambhara : ‘ విశ్వంభ‌ర ‘ లోనూ వేలు పెట్టిన చిరు .. మరో ఆచార్య అవుతుందా ?

vishvambhara : టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబోలో వచ్చిన మూవీ ఆచార్య .. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగానే చేశారు కానీ సరిగ్గా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోయింది. ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని మెగా యాంటీ ఫ్యాన్స్ అప్పటిలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసారు. ఇక మరోవైపు కొరటాల డైరెక్షన్ సరిగ్గా లేదని మెగా ఫ్యాన్స్ ట్రోల్ల్స్ మొదలు పెట్టారు. సినిమా సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ మధ్య వార్ హైలెట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే విశ్వంభర సినిమాకు కనిపించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు మ్యాటరేంటంటే ..


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ విశ్వంభర ‘ సినిమాలో నటిస్తున్నాడు.. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై చిరంజీవి ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తే .. మొన్న విడుదలైన టీజర్ మాత్రం గ్రాఫిక్స్ సరిగ్గా లేదని ట్రోల్ల్స్ కు గురైంది. విఎఫ్ఎక్స‌ నాణ్యత పై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. గ్రాఫిక్స్ సరిగా ఉందా.. లేదా.. అనేది చిన్నపిల్లలయినా చెప్పేసే విధంగా ఉంది. విశ్వంభ‌ర‌ విఎఫ్ఎక్స్ కూడా ఆదిపురుష్‌ తరహాలో ఉందంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.. గ్రాఫిక్స్ పై మేకర్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే విశ్వంభర గ్రాఫిక్స్ పై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షిస్తున్నారట. దగ్గరుండి గ్రాఫిక్స్ లో లోపాలను సరి చేస్తున్నాడట. అంతేకాదు ఇద్దరు డైరెక్టర్స్, కెమెరామెన్ చోటా కె నాయుడుతో కలిసి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

మొన్నీమధ్య చిరంజీవి వేలు పెట్టడంతోనే సినిమా ఫ్లాప్ అయ్యిందని కొరటాల శివ ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇక ఇప్పుడు విశ్వంభర లో కూడా వేలు పెట్టాడు చిరు .. మరి ఇది కూడా మరో ఆచార్య అవుతుందా అని మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువ టైం ఉండడం తో నాణ్యత ఎక్కడ దెబ్బ తింటుందో చూసుకొని వాటిని సరిచేసుకునే ప్లాన్లో చిరు ఉన్నాడట. అయితే టీజర్ లో చూపించిన సీన్స్ అన్ని సినిమాలో ఉండవని.. ఏఐ ద్వారా వాటిని టీజర్ లో వాడితే అవే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. నెటిజ‌న్ల‌ ద్వారా వచ్చిన విమర్శలు ట్రైలర్ పై రాకుండా చూసే పనిలో టీమ్ ఉన్నారని టాక్ ..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×