BigTV English
Advertisement

Chiru, Mahesh : మత్తు వదలరా పై చిరు, మహేష్ ల స్పందన.. అలా అనేసారేమిటి?

Chiru, Mahesh : మత్తు వదలరా పై చిరు, మహేష్ ల స్పందన.. అలా అనేసారేమిటి?

Chiranjeevi, Mahesh babu positively respond on Mathu vadalara 2: తొలి ఆటనుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది మత్తు వదలరా2 .శ్రీసింహా, సత్య కలిసి చేసిన అల్లరి థియేటర్లలో మార్మోగిపోతోంది. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ ఈ మూవీకి కొండంత బలం చేకూర్చింది. ఫరియా అబ్దుల్లా కి కూడా జాతి రత్నాలు మూవీ తర్వాత అంతటి పేరు తెచ్చింది. సాంకేతికంగా కూడా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. కాలభైరవ సంగీతం సినిమాకు హైప్ తెచ్చింది. దర్శకుడు రితేష్ రాణా తనదైన శైలిలో హాస్యపు సంభాషణలు రాశారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఆ డైలాగులను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ కి ఈ మూవీ బాగా నచ్చేసింది. మొన్న వచ్చిన హాయ్ ఇప్పుడొచ్చిన మత్తు వదలరా 2 రెండూ కూడా లో బడ్జెట్ సినిమాలే.


కంటెంట్ ఉన్న సినిమాలు

భారీ సినిమాలను కాదని ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. అయితే ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా మెగా స్టార్ ఈ సినిమాపై తన స్పందన తెలిపారు. ‘ఈ మధ్య కాలంలో బిగినింగ్ నుంచి ఎండ్ కార్డ్ దాకా ఇంతలా నవ్వించిన సినిమాను నేను చూడలేదు. సినిమా ఆఖర్లో వచ్చిన ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను. మొత్తానికి ఈ గొప్పతనం అంతా దర్శకుడు రితేష్ రాణాకే దక్కుతుంది. అతని రాత, తీత, కోత, మోత అన్నీ వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అన్నీ స మపాళ్లలో ఉండేలా దర్శకుడు చాలా జాగ్రత్తగా తీశారు. అతను తీసిన విధానాన్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మంచి విజయం అందుకున్న మైత్రీ మూవీస్ అధినేతలకు నా అభినందనలు అన్నారు. ఈ సినిమాను ఎవరూ మిస్ కావద్దు..ఇప్పటిదాకా చూడకపోతే చూడండి..వంద శాతం వినోదం గ్యారెంటీ’.. ఈ చిత్రంలో నటించిన శ్రీసింహా, సత్య, ఫరియా అబ్ధుల్లా తదితర నటీనటులకు నా అభినందనలు’ అన్నారు.


మెగా ట్వీట్

చిరంజీవి ట్వీట్ తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఖచ్చితంగా చిరంజీవి ప్రభావం ఈ సినిమాపై ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పేరును కూడా బాగానే వాడుకున్నారు దర్శకుడు. ఇదెలా ఉంటే మహేష్ బాబు సైతం ఈ సినిమాపై తన అమూల్యమైన స్పందన తెలిపారు. ఈ మధ్య చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్న మహేష్ బాబు గతంలోనూ కొణిదెల నిహారిక నిర్మాతగా అందించిన కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందంటూ నిహారికను మెచ్చుకున్నారు. మహేష్ ట్వీట్ తో కమిటీ కుర్రోళ్లు సినిమా కలెక్షన్లు కూడా పెరిగాయి. మహేష్ కు తన ధన్యవాదాలు తెలిపారు నిహారిక.

Also read: తాజ్ మహల్ కి ప్రమాద ఘంటికలు.. ఆందోళన కలిగిస్తున్న లీకేజీలు

మహేష్ బాబు ట్వీట్

ఇప్పుడు మహేష్ బాబు మత్తు వదలరా మూవీపై చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా ను తాను చూశానని..అద్యంతం తనని ఎంటర్టైన్ చేసిందని నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సత్య నువ్వు తెరపై కనిపించినంత సేపూ నా కూతురు సితార తెగ ఎంజాయ్ చేసింది. నవ్వు ఆపుకోలేకపోయింది. మా ఫ్యామిలీ మంబర్స్ అంతా నీ నటనను ఎంజాయ్ చేశాం. అద్భుతంగా నటించావంటూ సత్య ను ప్రత్యేకంగా అభినందించారు మహేష్ బాబు. చిరంజీవికి తోడు మహేష్ బాబు ట్వీట్లతో ఇక ఈ సినిమా కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని..వరుస వీకెండ్ సెలవలు, సోమ, మంగళవారాల సెలవలు ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×