BigTV English
Advertisement

Chiranjeevi: కొణిదెల శివశంకర వరప్రసాద్ టూ మెగాస్టార్.. ఒక్క ఫోటోతో 50 ఏళ్లు వెనక్కి..

Chiranjeevi: కొణిదెల శివశంకర వరప్రసాద్ టూ మెగాస్టార్.. ఒక్క ఫోటోతో 50 ఏళ్లు వెనక్కి..

Chiranjeevi: కొణిదెల శివశంకర వరప్రసాద్ ఈ పేరు  చాలామందికి తెలియకపోవచ్చు.. మెగాస్టార్ చిరంజీవి అని పూర్తిపేరు చెప్పేలోపే ప్రపంచం మొత్తం ఆయన గురించి ఒక చరిత్ర చెప్పినట్టు చెప్పుకొస్తారు.  ఇండస్ట్రీకి కొత్తగా ఎవరైనా హీరో వస్తే.. వారిని ఎవరిని చూసి మీరు హీరో అవ్వాలనుకున్నారు అని అడగండి..  టక్కున చిరంజీవి అని చెప్పేస్తాడు. బయట స్టెప్స్ వేసే ఒక కుర్రాడిని నీకు ఈ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే.. చిరంజీవి. ఇలా ఎన్నో కోట్లమంది అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగాలనుకొనే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి కొణిదెల.


చిరంజీవి.. ఇదొక పేరు కాదు.. ఒక బ్రాండ్.  కేవలం సినిమాల విషయంలోనే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన పేరు బ్రాండ్ నే. ఇండస్ట్రీలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా ముందు వినిపించే పేరు చిరంజీవి. ఇక ఈ పేరు ఇండస్ట్రీకి పరిచయమై నేటికీ 50 ఏళ్ళు. అవును.. ఈ విషయాన్నీ చిరుని స్వయంగా తెలిపారు. తన మొట్ట మొదటి రంగస్థల నాటకానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

They Call Him OG: ఆ కటౌట్ కనిపించినా చాలు సార్.. పూనకాలే


“‘రాజీనామా.. Y N M College Narsapur లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం” అంటూ రాసుకొచ్చారు. ఆ ఫొటోలో చిరు.. ఎంతో అందంగా కనిపించారు. వైట్ కలర్ షర్ట్.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఎంతో హుందాగా .. అంతకుమించి అప్పటి స్టైల్ కు తగ్గట్లు కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన చిరంజీవి.. ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ.. హీరోగా  మారారు. ఖైదీ సినిమా చిరు జీవితాన్నే మార్చేసింది.  ఆయన సినీ కెరీర్ గురించి చెప్పాల్సివస్తే.. ఖైదీకి ముందు ఖైదీకి తరువాత అని చెప్తారు. యాక్షన్ హీరోగా చిరంజీవిని మార్చేసిన సినిమా అది. ఈ సినిమా అనంతరం.. చిరు  విజయపరంపర  మొదలయ్యింది. విజయాపజయాలను పక్కన పెట్టి.. వరుస  సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సుప్రీం హీరో అనే ట్యాగ్ లైన్ నుంచి మెగాస్టార్ అనే ట్యాగ్ వరకు వచ్చి ఆగింది.

Manchu Lakshmi: తల్లి చేసిన పని.. పిల్లలకు అవమానం.. కంటతడి పెట్టిస్తున్న మంచు లక్ష్మీ..!

ఇక ఈ 50 ఏళ్ల కెరీర్ లో చిరు ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో అవమానాలను, విమర్శలను అందుకున్నారు. కానీ, ఎప్పుడు కూడా ఎవరిని పల్లెత్తి మాట అనలేదు. ఆయన నటనకు రాని అవార్డు లేదు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సహా అన్ని అవార్డులు చిరును వెత్తుకుంటూ వచ్చాయి.  మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి పరాజయం చవిచూసిన చిరు.. మళ్లీ ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తున్నారు. ఇక  సినిమాల విషయం  పక్కన పెడితే.. సేవా కార్యక్రమాలతోనే ప్రజల మనస్సులో దేవుడు అయ్యారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్.. ఇలా ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా.. తనవంతు సహాయం చేయడంలో చిరు ఎప్పుడు ముందే ఉంటారు.

ప్రస్తుతం చిరు వయస్సు 69. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా  ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. త్వరలోనే  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ఫోటోను, విశ్వంభర ఫోటోను పక్క పక్కన యాడ్ చేసి 50 ఏళ్ల చిరంజీవి..  కొణిదెల శివశంకర వరప్రసాద్ టూ మెగాస్టార్ అంటూ  సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×