BigTV English

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Chiranjeevi.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఈ రోజున ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి తన సినీ కెరియర్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, మెగాస్టార్ గా ఎదిగారు. తన సినిమాలతో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని మరీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి ఎక్కబోతున్నట్లు అభిమానులకు తెలియడంతో తెగ సంబరపడిపోతున్నారు. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను సైతం చిరంజీవికి అందించేందుకు హైదరాబాదులో ఒక భారీగా ఈవెంట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం.


చిరంజీవికి అరుదైన గౌరవం..

బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవికి దక్కిన ఈ గౌరవాన్ని అనౌన్స్ చేయించ బోతున్నట్లు సమాచారం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారులతో పాటు అమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రాబోతున్నారు. ఈ విషయాన్ని కూడా కొన్ని గంటలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే చిరంజీవికి ఈ గిన్నిస్ రికార్డు ఏ విషయంలో దక్కబోతోందో ఇప్పుడు చూద్దాం.


ఇండియన్ బెస్ట్ డాన్సర్ గా గుర్తింపు..

Chiranjeevi: Megastar's place in Guinness record.. at the hands of Aamir Khan..!
Chiranjeevi: Megastar’s place in Guinness record.. at the hands of Aamir Khan..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే దాదాపు 150 కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పుడు జయమాలిని వంటి బెస్ట్ డాన్సర్స్ ని కూడా వెనక్కి నెట్టిన ఘనత ఈయనది తన బ్రేక్ డాన్స్ తో అందరిని ఉర్రూతలూగించారు. డాన్స్ కే ఒక కొత్త నిర్వచనం చూపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ అంటే.. తన శరీరాన్ని స్ప్రింగ్ లా మార్చడమే కాదు, ఆయన డాన్స్ లో ఒక రిథమ్ ఉందని చెప్పవచ్చు.

బెస్ట్ డాన్సర్ గా గిన్నిస్ రికార్డుల్లో చిరంజీవికి స్థానం..

అందుకే మెగాస్టార్ చిరంజీవి లా ఇతర నటీనటులు డాన్స్ చేయలేరు అనడంలో సందేహం లేదు. చిరంజీవి తరహాలో స్టెప్పులు వేసిన మరో ఇండియన్ హీరో లేరు కాబట్టే ఆయన నృత్యాలకు కూడా గిన్నిస్ బుక్ ఇప్పుడు ఫిదా అయిపోయింది. అందుకే చిరంజీవికి గిన్నిస్ రికార్డు డాన్స్ విషయంలోనే దక్కబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాతే ఈ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే ఈవెంట్ హైదరాబాద్ సిటీలోని ఐటిసి కోహినూర్ హోటల్ వేదికగా చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వేడుకకు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హాజరు అవ్వడమే కాదు ఆయన చేతుల మీదుగా ఈ ప్రౌడ్ మూమెంట్ ని రివీల్ చేయించనున్నారు.

చిరంజీవికి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందా..

ఒకవేళ గిన్నిస్ రికార్డుల్లో చిరంజీవి స్థానం సంపాదించుకోబోతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది మెగా కుటుంబానికి ఏకంగా రెండు గుడ్ న్యూస్ లు వచ్చాయని చెప్పవచ్చు. అందులో ఒకటి ఈ ఏడాది మొదట్లో పద్మ విభీషణ్ అవార్డును కూడా అందుకున్నారు చిరంజీవి . ఇప్పుడు గిన్నిస్ రికార్డుల్లో స్థానంతో పాటు అక్కినేని అవార్డును కూడా దక్కించుకోబోతున్నారు చిరంజీవి. చిరంజీవి చిత్రాల విషయానికి వస్తే.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా చిత్రబృందం ప్లాన్ చేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×