Chiranjeevi New Movie.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తెరపైకి వచ్చింది. ఒక సినిమా తీసి, మాస్ హిట్ కొట్టి, ఇప్పుడు అదే సినిమా హీరోతో మరో సినిమా చేస్తున్న యువ దర్శకుడుకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మూవీ..
నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, తెలంగాణలో సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో వచ్చిన చిత్రం దసరా(Dasara). ఇందులో మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) డీ గ్లామరస్ పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమాకి పలు అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సెట్ మీద ఉంది.
నాని సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవితో మూవీ..
అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవితో సినిమా చేస్తారని సమాచారం. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల చిరంజీవికి సాలిడ్ స్క్రిప్ట్ చెప్పగా, చిరంజీవి కూడా నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్ ‘ సినిమా తర్వాత ఈ సినిమా మొదలుకానున్నట్లు సమాచారం. ఇకపోతే చిరంజీవి ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం మారుతి(Maruthi), వెంకీ కుడుముల (Venky kudumula)దగ్గర కూడా కథలు విన్నారట. అయితే ఆ సినిమా కథలు వర్కౌట్ కాకపోవడం వల్ల సెట్స్ మీదకు వెళ్లలేదని సమాచారం. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు మెగాస్టార్ చిరంజీవి ముగ్ధులు అయినట్లు, అందుకే ఆయనతో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. ఎవరు ఈ కాంబో ని ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
సుకుమార్ దగ్గర శిష్యరికం..
ఇకపోతే శ్రీకాంత్ ఓదెల విషయానికి వస్తే క్రియేటివ్ జీనియస్ లెక్కల మాస్టర్ సుకుమార్(Sukumar)దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సుకుమార్ దర్శకత్వంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, పాన్ ఇండియా హీరోయిన్ సమంత (Samantha) హీరోయిన్ గా వచ్చిన ‘రంగస్థలం’ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు శ్రీకాంత్ ఓదెల. పైగా రామ్ చరణ్ తో శ్రీకాంత్ ఓదెలకు మంచి పరిచయం ఉంది. దీనికి తోడు దసరా సినిమా మంచి మాస్ హిట్ అందుకోవడంతో శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
చిరంజీవి సినిమాలు..
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అదే కళ్యాణ్ రామ్ (Kalyan Ram)తో ‘బింబిసారా’ సినిమా తీసి భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.