BigTV English
Advertisement

Chiranjeevi: చిరు- అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్.. మరో ఎఫ్ 2 అవుతుందేమో.. ?

Chiranjeevi: చిరు- అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్.. మరో ఎఫ్ 2 అవుతుందేమో.. ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లైనప్ చూస్తుంటే.. ఫ్యాన్స్ కు  మెంటల్ వచ్చేస్తుంది. కుర్ర హీరోలు కూడా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు  తీయడానికి కష్టపడుతుంటే.. 69 ఏళ్ల వయస్సులో వరుస సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే కుర్ర డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర పట్టాలెక్కింది. ఇది కాకుండా కొద్దిసేపటి క్రితమే  చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమాను న్యాచురల్ స్టార్ నాని అధికారికంగా ప్రకటించాడు. అసలు ఈ కాంబో ఎవరు ఊహించనిది.


దసరా  లాంటి వైలెంట్ ఫిల్మ్ తో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్  కావడంతో.. ఫ్యాన్స్  సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు  పెట్టుకున్నారు.  అందులో న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రజెంట్  చేయడం మరింత  హైప్ ను తీసుకొచ్చిపెట్టింది. విశ్వంభరను పూర్తిచేసి వెంటనే చిరు.. చిరంజీవి ఓదెల సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.  ఇక ఈ రెండు సినిమాలు కాకుండా చిరు లిస్ట్ లో ఇంకొక సినిమా యాడ్  అయ్యింది.

Anasuya: పచ్చకోకలో రంగమ్మత్త.. బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తిస్తుందిగా


జూనియర్ జంధ్యాల అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా అవ్వగానే.. చిరు సినిమాను మొదలుపెట్టనున్నాడట.

ఇది అస్సలు ఎవరు ఊహించని కాంబో. ఇప్పటికే అనిల్.. చిరును కలవడం, కథను వినిపించడం, ఓకే చేయించడం కూడా జరిగిందట. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం  అనిల్ రావిపూడి  కామెడీ. అర్ధం పర్థం లేని కామెడీతో కథను చంపేస్తాడని అనిల్ గురించి ఇండస్ట్రీలో ఒక టాక్. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చాలామందికి నచ్చలేదు కూడా. ఇక ఇప్పుడు అలాంటి కామెడీతో చిరు వస్తే కనుక కచ్చితంగా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

Nidhhi Agerwal: అందరికి నమస్కారం బ్యాచ్ కాదని ఎవరిని అంటున్నావ్ పాప..

అయితే అందుతున్న సమాచారం ప్రకారం..  చిరుతో అనిల్ సినిమా.. ఒక మెసేజ్ ఓరియేంటేడ్ ఫిల్మ్ అని అంటున్నారు. బాలయ్యతో భగవంత్ కేసరి ఎలా అయితే  తీసాడో.. అలాంటి ఒక డిఫరెంట్ కథతో అనిల్- చిరు సినిమా ఉండబోతుందని టాక్. త్వరలోనే ఈ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించిననున్నారట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ కాంబోలోనే భగవంత్ కేసరి వచ్చింది. ఇప్పుడు  అదే కాంబో.. చిరుతో అసోసియేట్ అయ్యింది. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×