Honey: బరువు తగ్గడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే అనేక గుణాలు తేనెలో ఉన్నాయి. దాని ప్రత్యేకత కారణంగా, ఆయుర్వేదంలో తేనె కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద ఔషధాలలో తేనెను ఉపయోగిస్తారు. అంతే కాకుండా బరువును తగ్గించడంలో తేనెను కూడా విరివిగా ఉపయోగిస్తారు.
తేనె రుచికరమైంది మాత్రమే కాదు. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, బరువు తగ్గడానికి ఎలా పని చేస్తుంది ?
జీవక్రియను పెంచుతుంది: తేనెలో ఉండే కొన్ని అంశాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది: తేనె తిన్న తర్వాత మీకు చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వలన మీరు తక్కువగా తింటారు.
శరీరానికి శక్తిని అందిస్తుంది: తేనె శరీరానికి శక్తిని అందించే సహజ చక్కెరల యొక్క మంచి మూలం.
తేనెను ఎలా ఉపయోగించాలి ?
గోరువెచ్చని నీటితో: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం వల్ల జీవక్రియలు పెరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పాలతో: ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా తేనె కలిపి తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.
పెరుగుతో: పెరుగులో తేనె కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది . అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పండ్లతో: పండ్ల ముక్కలను తేనెతో కలిపి తింటే తీపి ఆహారంపై కోరిక తగ్గుతుంది.
కొన్ని ముఖ్యమైన విషయాలు :
పరిమాణాన్ని గుర్తుంచుకోండి: తేనె బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, దానిని అధికంగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి.
ఇతర ఆహారాలపై కూడా శ్రద్ధ వహించండి: తేనెతో పాటు, సమతుల్య ఆహారం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.
సలహా తీసుకోండి: మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తేనెను తీసుకునే ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని సంప్రదించండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హోం రెమెడీ అనేక శారీరక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తేనె నీరు త్రాగడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:
బరువు తగ్గడంలో సహాయకారి: తేనెలో తక్కువ కేలరీలు ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అంతే కాకుండా ఆకలి తగ్గుతుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుంగా గ్యాస్ తో పాటు అజీర్ణాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి , ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Also Read: మీ కిచెన్‌లో ఉన్న ఈ 5 పదార్థాలు.. వ్యాధులకు కారణం అని మీకు తెలుసా ?
శక్తి స్థాయిలను పెంచుతుంది: శక్తిని అందించే సహజ చక్కెరలకు తేనె మంచి మూలం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె నీటిని తాగడం వల్ల మీ రోజును ప్రారంభించడానికి అవసరమైన శక్తిని పొందవచ్చు.
చర్మానికి మేలు చేస్తుంది: తేనెలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు , తామర వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీట్యూసివ్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును తగ్గిస్తాయి.