Nidhhi Agerwal: టాలీవుడ్ లో అందం, అభినయం ఉండి.. విజయం మాత్రం దక్కని హీరోయిన్స్ లిస్ట్ లో నిధి అగర్వాల్ కూడా ఒకరు. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడి అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక అన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నిధి వెంటనే తమ్ముడు అఖిల్ తో జతకట్టింద. మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా విజయం అందుకోలేకపోయింది. అలా వచ్చిన ఛాన్స్ లు అన్ని ఒడిసిపట్టుకుని, విజయాపజయాలను లెక్కచేయకుండా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంది.
ఇక తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలోనే కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఒక సినిమా చేయగా.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. అంతేనా ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ పుకార్లపై నిధి ఎప్పుడు స్పందించింది లేదు. కెరీర్ పరంగా నిధి మంచి హిట్ కొట్టాలనే కసితో ఉంది.
Chiranjeevi Odela: చిరంజీవి ఓదెల మూవీ.. అధికారికంగా ప్రకటించిన నాని
ఇక ప్రస్తుతం అమ్మడు చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా అమ్మడు ఛాన్స్ పట్టేసిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ మధ్యనే పవన్ క్లైమాక్స్ షూట్ లో పాల్గొన్నాడు. ఇక ఇది కాకుండా మరో పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ లో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ – మారుతీ కాంబోలో వస్తున్నా ఈ సినిమాలో ముగ్గురు హీరొయిన్స్ లో నిధి ఒకరు. అమ్మడు ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే పెట్టుకుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే .. నిత్యం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది నిధి. హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేయడమే కాకుండా.. అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన నిధి.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. రాజాసాబ్ గురించి, హరిహరవీరమల్లు గురించి.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.
Horror Movie In OTT : వామ్మో.. ఇలాంటి సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి.. ఒంటరిగా చూస్తే అంతే..
ఇక ఒక అభిమాని.. మేడమ్ మీకు తెలుగు వచ్చా.. ? అని ఒక ప్రశ్న అడగ్గా .. నిధి చెప్పిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ” వస్తుంది అండి.. ఎందుకు డౌట్.. నేనేమి అందరికి నమస్కారం బ్యాచ్ కాదు” అని చెప్పుకొచ్చింది. తెలుగు వచ్చు అన్నంత వరకు ఓకే కానీ, అందరికి నమస్కారం బ్యాచ్ కాదు అంటే.. మిగతా హీరోయిన్లను వెటకారం చేసినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
వేరే భాష నుంచి వచ్చిన హీరోయిన్స్.. తెలుగులో మాట్లాడాల్సి వస్తే.. మొదట అందరికి నమస్కారం అని చెప్పి ఆ తరువాత ఇంగ్లీష్ లో మాట్లాడతారు. టాలీవుడ్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నా కూడా తెలుగు మాట్లాడలేని హీరోయిన్స్ కు నిధి కౌంటర్ వేసిందా.. ? ఏ హీరోయిన్స్ ను ఉద్దేశించి నిధి ఆ మాట అంది అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. ఈ సినిమాల ఈవెంట్స్ లో అమ్మడు తెలుగు మాట్లాడుతుందో లేదో చూడాలి.
Vastundi andi.. Enduku doubt? I am not only “andariki namaskaram” batch ok? 😝 https://t.co/GPK99kUl0P
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 3, 2024