Mega Family.. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ (Mega Family)కి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ముఖ్యంగా వీరు సినిమాలతో అభిమానులను మెప్పించడమే కాదు అభిమానం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు అభిమానుల కోసం అండగా ఉండే మెగా ఫ్యామిలీ ఇప్పుడు అవసరమైన చోట ఎక్కడ తగ్గాలో తెలిసిన కుటుంబం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేలకోట్ల రూపాయలను సంపాదించినా.. ఎప్పుడూ కూడా ఆ గర్వం చూపించుకోలేదు. ఒకరి దగ్గర వినమ్రత చూపిస్తూ అందరి మనసులు దోచుకున్నారు. ఇకపోతే అభిమానం కోసం రెమ్యూనరేషన్ ని కూడా పక్కనపెట్టి తమ మంచి మనసును చాటుకున్నారు. ఇది చూసిన మెగా అభిమానులు నిజంగా గ్రేట్ కదా అంటూ తమ అభిమాన హీరోలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. గత రెండు బిగ్ బాస్ సీజన్స్ ఫినాలే ఎపిసోడ్స్ కి ముఖ్య అతిథులు ఎవరూ రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండవ సీజన్ కి విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆ తర్వాత సీజన్ 3 నుండి సీజన్ 5 వరకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అంతేకాదు కంటెస్టెంట్స్ తో చిరంజీవి జరిపిన చిట్ చాట్ కూడా అప్పట్లో బాగా హైలైట్ అయింది.ఆ మూడు ఫినాలే ఎపిసోడ్స్ కి టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సీజన్ 6, సీజన్ 7కి ఎవరు కూడా చీఫ్ గెస్ట్ లు రాలేదు. గత సీజన్ ఫినాలే ఎపిసోడ్ కి మొదట మహేష్ బాబు(Maheshbabu) వస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఆ సీజన్లో పల్లవి ప్రశాంత్ కి హోస్ట్ నాగార్జున(Nagarjuna)చేతుల మీదుగానే ట్రోఫీని అందించారు
అయితే ఈ సీజన్ 8కి కూడా అల్లు అర్జున్(Allu Arjun) ముఖ్యఅతిథిగా రాబోతున్నారు అంటూ ప్రచారం సాగింది.కానీ బిగ్ బాస్ టీం అసలు అల్లు అర్జున్ ని సంప్రదించలేదని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కోసం ప్రయత్నం చేస్తున్నారని, రామ్ చరణ్ ఈ ఫినాలే ఎపిసోడ్లో పాల్గొనడానికి సముఖత చూపించారని కూడా వార్తలు వినిపించాయి. ఇక అందులో భాగంగానే నిన్న సాయంత్రం రామ్ చరణ్ కచ్చితంగా రాబోతున్నాడు అనే వార్త ఖరారు అవడంతో.. ఆయనే ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేశారు. ఇక అలా రామ్ చరణ్ చేతుల మీదుగా విజేత నిఖిల్(Nikhil)కి ట్రోఫీని అందివ్వడం జరిగింది.
ఇకపోతే ఇదంతా పక్కన పెడితే, ఏ కార్యక్రమానికైనా సరే ఎవరైనా చీఫ్ గెస్ట్ గా వెళితే కచ్చితంగా వారు రెమ్యునరేషన్ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ కూడా ఈ ఫినాలే కి వచ్చినందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అంటూ కూడా చర్చలు జరిగాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అక్కినేని నాగార్జున మీద ఉన్న అభిమానంతోనే రాంచరణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. అటు గతంలో చిరంజీవి కూడా నాగార్జున మీద అభిమానంతోనే రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అలా తండ్రీ కొడుకులిద్దరూ నాగార్జున మీద ఉన్న అభిమానంతోనే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని కూడా వదులుకున్నారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా అభిమానం కోసం కోట్ల రూపాయలను మెగా హీరోలు వదులుకోవడంతో అభిమానులు వారి వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు.