Lava Blaze Duo 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా.. Lava Blaze Duo 5G మెుబైల్ ను లాంఛ్ చేసింది. 6nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో ఈ మెుబైల్ వచ్చేసింది. ఇక గరిష్టంగా 8GB LPDDR5 RAM, డ్యూయల్ స్క్రీన్, అదిరే డిస్ ప్లే ఫీచర్స్ తో కిర్రాక్ అనిపిస్తుంది.
లావా తన బడ్జెట్ సెగ్మెంట్‌లో లావా బ్లేజ్ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. డ్యూయల్ స్క్రీన్, అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో ఈ మెుబైల్ ను తెచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 64MP ప్రైమరీ కెమెరాతో 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వచ్చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసిన ఈ మెుబైల్ ఫీచర్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
Lava Blaze Duo 5G స్పెసిఫికేషన్‌లు –
లావా తీసుకొచ్చిన ఈ Lava Blaze Duo 5G 6nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 8GB LPDDR5 RAMతో జత చేయబడింది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో నడుస్తుంది. అయితే త్వరలోనే ఆండ్రాయిడ్ 15కి అప్‌డేట్ ఇస్తామని లావా కంపెనీ హామీ ఇచ్చింది.
ఇక మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే… మెుదటి స్క్రీన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి + (1,080×2,400 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీపీ పిక్సెల్‌తో వచ్చేసింది. ఇక ఇందులో డ్యూయల్ స్క్రీన్ తో వచ్చేయండంతో రెండో స్క్రీన్ వెనుక ప్యానెల్‌లో 1.58 అంగుళాల (228×460 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే… 64MP ప్రైమరీ రియర్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33Wతో 5000mAh బ్యాటరీ సైతం ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే… ఈ స్మార్ట్ ఫోన్ లో బ్లూటూత్ 5.2, GPS, 5G, 4G LTE ఉన్నాయి.
ఇండియాలో Lava Blaze Duo ధర –
Lava Blaze Duo బేస్ మోడల్ 6GB+128GB వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. ఇక 8GB వేరియంట్ ధర రూ.20,499గా ఉంది. ఇక ఈ రెండు వేరియంట్స్ లో మాత్రమే ఈ మెుబైల్ అందుబాటులోకి వచ్చింది. ఇక కలర్ ఆఫ్షన్ విషయానికి వస్తే.. ఇది ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్స్ లో ఆకట్టుకునే విధంగా వచ్చేసింది. ఇక ఈ Lava Blaze Duo 5G మెుబైల్ విక్రయాలు డిసెంబర్ 20 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్ సంస్థ అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది. దీంతో పాటు లావా అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసిన అవకాశం ఉన్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఇక ఈ మొబైల్ పై డిస్కౌంట్స్, ఆఫర్స్ సైతం వర్తిస్తాయని చెప్పుకు వచ్చింది. వినియోగదారులు 6GB+128GB వేరియంట్‌ను రూ. 16,999కు, 8GB+128GB వేరియంట్ ను రూ. 17,999కే కొనుగోలు చేయెుచ్చని తెలిపింది. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఈ అదిరే మెుబైల్ మీకూ కావాలనుకుంటే ట్రై చేసేయండి.
ALSO READ : వొడాఫోన్-ఐడియా 5G సర్వీసెస్ ప్రారంభం.. ఏ నగరాల్లో మెుదలయ్యాయంటే!