BigTV English

Chiranjeevi – Ram Charan: మ‌ళ్లీ చిరు, చ‌ర‌ణ్ సంద‌డి

Chiranjeevi – Ram Charan: మ‌ళ్లీ చిరు, చ‌ర‌ణ్ సంద‌డి
Chiranjeevi - Ram Charan

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయనున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళితే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంక‌ర్‌’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర రూపొందిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. దాదాపు 200 మంది డాన్స‌ర్స్‌తో శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో పాట‌ను షూట్ చేస్తున్నారు.


కాగా.. భోళా శంక‌ర్ పాట‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా న‌టించిన ఖైదీ నంబ‌ర్ 150లో ఓ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌ళుక్కున మెరిశారు. అలాగే ఆచార్య‌లో అయితే చిరు హీరోగా న‌టిస్తే చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. అంత‌కు ముందు చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరంజీవి గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ మెగా కాంబోలో మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై భోళా శంక‌ర్‌లో సంద‌డి చేయ‌నుంద‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే ఫ్యాన్స్ పండ‌గే.

అజిత్ హీరోగా న‌టించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంక‌ర్ తెర‌కెక్కుతోంది. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నుంది. ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంలో మే 12న భోళా శంక‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదే ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ సాధించారు. ఆ సినిమాలో పూనకాలు లోడింగ్ పాట ఎంత పెద్ద హిట్టలో మనకు తెలిసిందే. అలాంటి మరో మాస్ సాంగ్‌ను భోళా శంకర్‌లో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×