సినిమాలకు.. రాజకీయాలకు దగ్గర సంబంధాలుంటాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి చక్రం తిప్పినవాళ్లున్నారు. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అయితే రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు తక్కువగానే ఉంటారని చెప్పాలి. ఇప్పుడా లిస్టులోకి ఏపీ మంత్రి ఒకరు చేరబోతున్నారని సమాచారం. ఇంతకీ అదెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. ఇప్పుడామె సినీ రంగంపై ఫోకస్ చేశారని టాక్.
వివరాల్లోకి వెళితే.. విడుదల రజిని త్వరలోనే సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను ఆమె ప్రారంభించారట. హైదరాబాద్‌లో ఓ హై క్లాస్ బిల్డింగ్‌ను కూడా ఆమె రెంట్‌కు తీసుకుని అందులో సినీ నిర్మాణానికి కార్యకలాపాలను ప్రారంభించారని సమాచారం. అందులో భాగంగా తొలి సినిమాకు సంబంధించి కథ కూడా ఓకే అయ్యిందని త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా న్యూస్ వినిపిస్తుంది. మరి రజిని తన పేరుని స్క్రీన్‌పై వేసుకుంటారా? లేక వెనుకుండి నడిపిస్తారా? అని తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
విడదల రజిని 2014లో తెలుగుదేశంలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్లు ముందు జరిగిన ఏపీ మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణలో రజినీకి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పదవి దక్కింది.