BigTV English

Chiranjeevi: పాపులారిటీ కోసమే సెలబ్రిటీలను వాడుకుంటున్నారు – మెగాస్టార్ ఫైర్..!

Chiranjeevi: పాపులారిటీ కోసమే సెలబ్రిటీలను వాడుకుంటున్నారు – మెగాస్టార్ ఫైర్..!

Chiranjeevi.. బుధవారం నాడు మీడియా ముందు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సినీ సెలబ్రిటీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మండిపడుతూ.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్వీట్ వేశారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను తక్కువ చేస్తూ.. హేళనగా మంత్రి మాట్లాడిన తీరుపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఈ విషయంపై మెగాస్టార్ కూడా స్పందిస్తూ ట్వీట్ వేశారు.


సురేఖ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన మెగాస్టార్..

మెగాస్టార్ కొండా సురేఖ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. కొంతమంది రాజకీయ నాయకులు వార్తల్లో నిలవడానికి ప్రత్యేకించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అసత్య ఆరోపణలు చేయడం అత్యంత దారుణం. అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఈ విషయాలలోకి దయచేసి లాగవద్దు. రాజకీయ నేతలు అనేవారు అందరికీ ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి. కానీ తమకు తాము దిగజారిపోయే కామెంట్లు చేయకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు మెగాస్టార్.


సమంత – నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్.

నిన్న బుధవారం రోజు కేటీఆర్ పై ఆగ్రహంతో.. సినీ సెలబ్రిటీలను ఇందులోకి లాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ హాట్ బాంబు పేల్చారు మంత్రి కొండా సురేఖ.

మంత్రి కొండా సురేఖ పై సినీ సెలబ్రిటీలు ఆగ్రహం..

దీంతో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తూ.. మంత్రి కొండా సురేఖ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ మొదలుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, ప్రముఖ సింగర్ చిన్మయి, నాగార్జున, అమల, చివరికి సమంత కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాజకీయాలతో సంబంధం లేని తనను ఇలా రాజకీయాల్లోకి లాగొద్దని తెలిపింది సమంత.

సమంత మంచితనమే ఆమెకు అండగా నిలబడుతోందా..

ఇకపోతే కాంట్రవర్సీకి ఎప్పుడు దూరంగా ఉండే సమంత చాలా వరకు వివాదాలకు జోలికి వెళ్ళదని చెప్పవచ్చు. తన పని తాను చేసుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమెపై కొండా సురేఖ తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఆమె వ్యక్తిగత జీవితం పై చేసిన కామెంట్లకు సినీ సెలెబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. నిజానికి సమంతా సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె మంచితనానికే ఇప్పుడు సినీ సెలెబ్రిటీలంతా అండగా నిలబడుతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక అటు అక్కినేని ఫ్యామిలీ కూడా సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి వెళ్లదు. ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమైపోయి.. కెరియర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఇందులోకి లాగుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సినీ సెలబ్రిటీలు వీరికి అండగా నిలుస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×