Chiranjeevi’s gift to Balayya director : సాధారణంగా హీరోలు వారి సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకులకు, ఇతర టెక్నీషియన్స్‌కో గిఫ్ట్స్ ఇస్తుంటారు. అలాంటిది తనకు పోటీగా సినిమాను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి చిరంజీవి గిఫ్ట్ ఇచ్చారట. వివరాల్లోకి వెళితే, రీసెంట్ ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘‘నాకు, రవితేజకు పోలికలుంటాయని చాలా మంది అన్నారు. కొన్నిసార్లైతే మాంటేజ్ షాట్స్ తీసేటప్పుడు నేను వెళ్లిపోతున్నా అబ్బాయ్ నువ్వే చూసుకో అని చెప్పేసి రవితేజ వెళ్లిపోయేవారు. అలాగే చిరంజీవిగారు నన్ను బక్క రవితేజ అని కామెంట్ చేసేవారు. ఓసారి నేను షూటింగ్‌లో ఉన్నాను. ఆరోజు నా బర్త్ డే. విషయం తెలియగానే చిరంజీవి, అరవింద్‌గారు సెట్స్‌లో నాతో కేక్ కట్ చేయించారు. అప్పుడు ఆయన ఓ వాచ్ తెప్పించి ఇచ్చి.. ఇకపై నీ టైమ్ అంతా బావుంటుందిలే’’ అని అన్నారంటూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు గోపీచంద్ మలినేని.
2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ వీరసింహా రెడ్డి చిత్రాలు పోటీ పడ్డాయి. వాల్తేరు వీరయ్యను బాబీ డైరెక్ట్ చేయగా, వీర సింహా రెడ్డిని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశారు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఆ హీరోలకు వీరాభిమానులే కావటం విశేషం.
Follow this link for more updates : Bigtv