Dhruva Natchathiram : ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ ‘ధృవ నట్చత్తిరం’ (Dhruva Natchathiram) మూవీ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా విక్రమ్ అభిమానులు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఫిక్స్ అయిన తరుణంలో విక్రమ్ (Vikram) అభిమానులకు గుడ్ న్యూస్ అనే వార్త ప్రచారం అవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీని మేకర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘ధృవ నట్చత్తిరం’ మూవీ రిలీజ్ కాకుండానే ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ మూవీ మొదట ఆగస్టు 2017లో విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పట్లోనే అనేక సమస్యల కారణంగా ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఆ తరువాత పూర్తిగా మూవీ రిలీజ్ ఆగిపోయింది అనే వార్తలు విన్పించాయి. ఇప్పటిదాకా ఈ మూవీ రిలీజ్ కానేలేదు. అయితే అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఈ చిత్రం రెండు నెలల్లోనే థియేటర్లలోకి వస్తుందని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గుడ్ న్యూస్ చెప్పారు. అప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఎదురు చూస్తున్నారు విక్రమ్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే తమిళ మీడియాలో విన్పిస్తున్న రూమర్ల ప్రకారం ఈ చిత్రం 2025 మే 1న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ రూమర్లపై ఇప్పటిదాకా ఇంకా నిర్మాతల నుండి లేదా దర్శకుడి నుండి స్పష్టత రాలేదు.
సూర్య వర్సెస్ విక్రమ్
మొదట సూర్య ప్రధాన పాత్రలో ‘ధృవ నట్చత్తిరం’ చిత్రాన్ని ప్రకటించారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా చిత్రనిర్మాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. తరువాత 2015లో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రను పోషించడానికి ముందుకు రావడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కానీ ఆ తరువాత కూడా ఈ మూవీ పలు కారణాల వల్ల రిలీజ్ కు నోచుకోలేదు.
2025 జనవరిలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ యూట్యూబర్ మదన్ గౌరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనవరి విడుదల కోసం తాను చేస్తున్న ఒంటరి పోరాటం గురించి మాట్లాడాడు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ గురించి మూవీ లవర్స్ కు ఉన్న ఆసక్తి, అంచనాల కారణంగానే తాను రిలీజ్ గురించి పట్టుదలతో ఉన్నానని చెప్పాడు. ఈ సినిమా కోసం తాను ఒంటరిగా ఎంతగానో ఒత్తిడిని భరిస్తున్నట్టు వెల్లడించారు, జనవరి విడుదలకు సమస్యలు ఎదురైనప్పుడు పరిశ్రమ నుండి ఎవరూ సహాయం లేదా సూపపర్ట్ ఇవ్వడానికి ముందుకు రాలేదని అన్నారు. నిజానికి ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఇండస్ట్రిలోని కొంత మంది దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారని, కానీ సంతోషంగా మాత్రం ఉండరని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.