Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ జగ్గారెడ్డి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఆయన సొంతం. అందుకే ఆయన్ని కొందరు ఇష్టపడతారు. అప్పుడు కొన్ని విషయాలు బయటపెడతారనుకోండి. అది వేరే విషయం. ఇటీవల ఎన్నికల సంఘంలో ఐదు ఎమ్మెల్సీ సీట్లపై ప్రకటన చేసింది. దీనిపై చాలామంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఈ రేసులో జగ్గారెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తన మనసులోని మాట బయటపెట్టారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చే ప్రాధాన్యతతో తృప్తిగా ఉందన్నారు. తనకు ఎమ్మెల్సీ సీటు కావాలని అడగలేదు.. అడగనని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించినా, ఓడించినా లాభమే చేశారని మనసులోని మాట బయటపెట్టారు.
గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారాయన. ఈ సమయంలో కీలక విషయాలు బయటపెట్టారు. తాను ఓడిపోయినా భార్య నిర్మలకు ఛైర్మన్ అయ్యే ఛాన్స్ వచ్చిందన్నారు. కమ్మ సామాజిక వర్గంలో మూడు దశాబ్దాలుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్న వ్యక్తి కుసుమ కుమార్ అని తెలిపారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, పిసిసి మహేష్ గౌడ్,డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ దృష్టికి తెచ్చారన్నారు.
కమ్మ సామాజిక వర్గం, సెటిలర్స్‌కి అవకాశం ఇస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి లబ్ది చేకూరుతుందన్నారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యానని గుర్తు చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. జెట్టికి ఎమ్మెల్సీ ఇస్తే పార్టీకి బాగుంటుందన్నారు.
ALSO READ: రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు-సీఎం రేవంత్
హైదరాబాద్‌లో యాక్టివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. మూడు దశాబ్దాలుగా గాంధీ భవన్‌కి సేవలు చేస్తున్న కుమార్‌రావుకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. కులం ప్రాతిపదికన కాకుండా పార్టీకి సేవలు అందించిన వ్యక్తిగా అవకాశం ఇవ్వాలన్నారు. నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదన్నారు. కుసుమ కుమార్, కుమార్ రావులకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ రేసులో తాను లేనని చెప్పకనే చెప్పారాయన.