BigTV English

Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం.. నెట్టింట పోస్ట్ వైరల్

Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం.. నెట్టింట పోస్ట్ వైరల్

Sekhar Master Brother Passed Away : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మృతి చెందాడు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించారు.


“సుధా నిన్ను చాలా మిస్సవుతున్నాం. నేను ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎక్కడో ఒక చోట నువ్వు ఆనందంగా ఉండి ఉంటావనే అనుకుంటున్నాను. ఈ లోకంలో నువ్వు లేకపోయినా.. మాతోనే ఎప్పటికీ ఉంటావు. మిస్ యు రా తమ్ముడు” అని శేఖర్ మాస్టర్ తన తమ్ముడి ఫోటోలు షేర్ చేసి.. భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండండి సర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : గొప్ప మనసు చాటుకున్న విక్రమ్.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం


ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఈ పోస్ట్ పై స్పందించింది. మీరు ధైర్యంగా ఉండాలి అంటూ కామెంట్ చేసింది. శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందాడన్న విషయం తెలిసిన సినీ ప్రముఖులు, శేఖర్ మాస్టర్ అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు. కాగా.. ఆయన ఎలా చనిపోయాడన్న విషయం మాత్రం చెప్పలేదు. మూడు నెలల క్రితమే ఆయన వదిన కన్నుమూయగా.. ఇప్పుడు తమ్ముడు చనిపోవడంతో శేఖర్ మాస్టర్ తీవ్రవిషాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.

డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శేఖర్.. డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డారు. కొరియోగ్రాఫర్ నుంచి డ్యాన్స్ షో లకు జడ్జిగా ఎదిగారు. ఆయన ఢీ డ్యాన్స్ షో తో కొరియోగ్రాఫర్ గా గుర్తింపు లభించింది. బడా హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే.. మరోపక్క షార్ట్ ఫిల్మ్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×