BigTV English

Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది

Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది

Himachal Pradesh heavy rains(Today latest news Telugu): ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజూమున కొన్నిప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తారు.


సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్‌ఖాడ్ వద్ద వరదలు ముంచెత్తాయి. నీటి ప్రవాహానికి 20 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి.

గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టినట్టు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు. మరోవైపు వారి జాడ కనుగొనేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దించారు అధికారులు. పోటెత్తిన వరదల కారణంగా రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా దెబ్బతింది. హిల్స్ ఏరియాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.


ALSO READ: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

ఇదిలావుండగా కులులో పార్వతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి ఓ భవనం కూలి పోయింది. అయితే ఘటన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు ఆ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులకు హోటల్లో చిక్కుకున్నారు. తిరిగి రావాలన్నా రోడ్లు డ్యామేజ్ కావడంతో తెలియక హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

 

 

Related News

Los Angeles News: అందరూ చూస్తుండగా.. భారతీయుడిని కాల్చి చంపారు.. ఇదిగో వీడియో!

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Big Stories

×