BigTV English

Ride on Prostitude House: హైదరాబాద్ లో బరితెగిస్తున్న వ్యభిచార ముఠా..ఏకంగా ఇళ్ల మధ్యనే?

Ride on Prostitude House: హైదరాబాద్ లో బరితెగిస్తున్న వ్యభిచార ముఠా..ఏకంగా ఇళ్ల మధ్యనే?

Hyderabad police raid on prostitute house conducting among the family colony : ఒకప్పుడు ఓ ప్రత్యేక ప్రాంతంలో వ్యభిచార గృహాలు ఉండేవి. ముంబాయిలోనూ రెడ్ లైట్ ఏరియాలో అధికారికంగా వ్యభిచారం నిర్వహించేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ణానం పెరిగిపోయింది. ఆన్ లైన్ లోనే వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం మొత్తం తెలిసిపోతోంది. కొంతమంది ప్రత్యేక గ్రూపులు, యాప్ ల ద్వారా ఇతర రాష్ట్రాలనుంచి యువతను ఎరగా వేసి యథేచ్ఛగా వ్యభిచార కేంద్రాలను నడిపిస్తున్నారు. బడా అపార్టుమెంట్లలో, ఖరీదైన కాలనీల మధ్యే వీరి కార్యకలాపాలు గుట్టుగా జరిపించేస్తున్నారు.


ఫ్యామిలీ అంటూ చేరి..

రెంటు ఎంత కావాలంటే అంత పే చేస్తారు. ముందుగా వైఫ్ అండ్ హజ్బెండ్ అంటూ వచ్చి చేరతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. వీళ్లకు ఉన్న పరిచయాలతో తాము ఉంటున్న లొకేషన్ షేర్ చేస్తూ ఇక్కడికి అమ్మాయిలను రప్పించి యథేచ్ఛగా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. బడా అపార్టు మెంట్లు కావడంతో పొరుగు ఇంటికి ఎవరు వస్తున్నారో ఏమిటో ఎవ్వరూ పట్టించుకోరు. వీళ్లను కలవడానికి గెస్టుల మాదిరిగా వస్తుంటారు విటులు. మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన యువతులకు డబ్బు ఆశగా చూపించి ముందు ఉద్యోగం పేరుతో వారికి అధిక జీతాలు ఇస్తామని నమ్మించి మెల్లిగా వారిని వ్యభిచారంలోకి దించుతున్నారు.


సినిమాలలో నటించాలనే కోరికతో..

సినిమాలలో నటించాలనే వ్యామోహంతో ఇంటినుంచి పారిపోయి వచ్చే యువతులకు కూడా సినిమా నిర్మిస్తున్నామంటూ ప్రకటనలు ఇచ్చి హీరోయిన్స్ సెలక్షన్స్ అంటూ వారిని ఈ వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా వంటి నగరాలలో ఈ తరహా వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ లోనూ ఈ తరహా కార్యకలాపాలు ఎక్కవైపోయాయి. ఇటీవల పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీలో ఓ ఇంటిలో ఈ తరహా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయారు. రంగంలోకి దిిన పోలీసులు సదరు నిర్వాహకుడు రాజును అరెస్టు చేయబోగా తెలివిగా రాజు తప్పించుకుని పారిపోయాడు. రాజు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు చందానగర్ పోలీసులు. మరో నలుగురు యువతులను , ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు ఎంక్వయిరీలో పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి.

రాజుకు ఉన్న నెట్ వర్క్

ఈ తరహా ఇళ్లు రాజు హ్యాండవర్ లో చాలానే ఉన్నాయని తెలుస్తోంది. నిందితుడు రాజు దొరికితే ఇలాంటి కేంద్రాల వివరాలు, ఇంకా ఎవరెవరు ఈ కూపంలో ఉన్నారు, అతనికి రెగ్యులర్ కస్టమర్లు ఎవరు అనే వివరాలు మరిన్ని తెలుస్తాయి. ఇళ్ల యజమానులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇళ్లలోకి కొత్తగా వచ్చేవారిపై ఓ కన్నేసి ఉంచాలని..అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. అపరిచితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని అంటున్నారు. అపార్టుమెంటు వాచ్ మెన్ లను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related News

Bhupalapally News: క్షుద్రపూజలకు యువతి బలి? భూపాలపల్లిలో షాకింగ్ ఘటన

Techie Suicide: ఇన్ఫోసిస్ టెక్కీ సూసైడ్.. వేధింపులే కారణమా?

Jagtial District: తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి

Dating App: దారుణం.. డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు బట్టలు విప్పి.. చివరకు..?

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Big Stories

×