BigTV English

Actress Pooja Gandhi : భాష నేర్పించిన వాడితో బంధం.. దండుపాళ్యం బ్యూటీ బోల్డ్ స్టెప్..

Actress Pooja Gandhi : భాష నేర్పించిన వాడితో బంధం.. దండుపాళ్యం బ్యూటీ బోల్డ్ స్టెప్..
Actress Pooja Gandhi update

Actress Pooja Gandhi update(Celebrity news today):

దండుపాళ్యం మూవీ ఫేమ్‌.. ప్రముఖ కన్నడ యాక్టర్ పూజా గాంధీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నాలుగు పదుల వయసు దాటిన ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పటికి తన జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. డిసెంబర్ 29 బుధవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త తో పూజా వివాహం జరగనుందని తెలుస్తోంది. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు బెంగళూరులోని యలహంకలో జోరుగా జరుగుతున్నాయని టాక్. 


2001 లో ఖత్రోన్ కే ఖిలాడీ తో హిందీలో తన కెరియర్ మొదలు పెట్టిన పూజా.. కన్నడ సినీ పరిశ్రమతో తన లక్ ట్రై చేయడానికి నటించిన ఫస్ట్ మూవీ ‘ముంగారు వర్మ’. మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ బ్యూటీ కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించి మరింత పాపులర్ అయింది. క్రమంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళ్ ,బెంగాలీ ,హిందీ ,తెలుగు ఇండస్ట్రీలో కూడా తన అందంతో.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.

తెలుగులో ఆమె కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ దండుపాళ్యం తెచ్చిన క్రేజ్ ఇంక ఏ మూవీ తీసుకురాలేదు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీలో ఆమె నటించిన బోల్డ్ క్యారెక్టర్.. విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా ఉంది. అందుకే ఆ తర్వాత వచ్చిన ఈ మూవీ సిరీస్.. మూడు సినిమాల్లో కూడా పూజా గాంధీనే మెయిన్ రోల్ పోషించింది. అయితే ప్రస్తుతం ఈ 40 ఇయర్స్ ఓల్డ్ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.


బెంగళూరులోని ఒక లాజిస్టిక్ కంపెనీ ఓనర్ విజయ్ తో పూజా ప్రేమలో ఉందని.. అతనితోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని తెలుస్తోంది. నిజానికి పూజ స్వస్థలం ఉత్తరప్రదేశ్.. ఆమె మాతృభాష హిందీ.. కానీ ఆమె బాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో సాలిడ్ గా సెటిల్ అయ్యింది. దీనికి కారణం విజయ్ అని తెలుస్తోంది. పూజకు అతను కన్నడ నేర్పించాడు కాబట్టే ఆ తర్వాత ఆమె కన్నడ మూవీస్ లో నటించగలిగిందట. అలా మొదలైన ఇద్దరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది.

2012లో పూజా కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద గౌడ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని తెలియని కారణాలవల్ల నిశ్చితార్థం జరిగి నెలరోజులు కూడా పూర్తి కాకముందే ఇద్దరూ విడిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు తిరిగి పూజా పెళ్లి గురించి ప్రస్తావించింది లేదు. తిరిగి ఇన్ని సంవత్సరాలకి పూజ ఓ ఇంటిది కాబోతోందని ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×