Big Stories

Postal Ballots : ఇంకొక్కరోజే సమయం.. అందని పోస్టల్ బ్యాలెట్లు.. అంతా గందరగోళం

telangana election latest news

Postal Ballots news(Telangana election latest news):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ఒక్క రోజే టైం ఉంది. అయినప్పటికీ ఇంకా.. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై గందరగోళం కొనసాగుతున్నది. ఈ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులుఆందోళనకు దిగిన సందర్భాలను మనం చూశాం. 119 సెగ్మెంట్లలో దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్‌ డ్యూటీలో ఉండగా.. అందులో లక్షా 60 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేసేందుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకోకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా పోస్టల్ బ్యాలెట్ కోసం Ceo వికాస్ రాజ్ నీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న దాదాపు 80వేల మంది ఉపాధ్యాయులకు సరిగ్గా పోస్టల్ బ్యాలెట్ అందలేదని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్‌ 2వ తేదీ వరకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలంటున్నారు. ఓటు విలువ తెలిపే మాకే ఓటు వేసే అవకాశం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రెండురోజులుగా గందరగోళం నెలకొనగా.. ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ అందరికీ పోస్టల్ బ్యాలెట్లను అందజేస్తామని చెప్పారు. కానీ.. ఇంకా సుమారు 70 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

.

.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News