BigTV English

Actor Jiiva loses cool: లైంగిక వేధింపులపై ప్రశ్న.. రిపోర్టర్‌పై మండిపడ్డ హీరో జీవా, అంత అవసరమా?

Actor Jiiva loses cool: లైంగిక వేధింపులపై ప్రశ్న.. రిపోర్టర్‌పై మండిపడ్డ హీరో జీవా, అంత అవసరమా?

Cinema Hero Jiiva loses cool: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ తమిళ హీరో జీవాకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన పలువురు నెటిజన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఎట్ ప్రజెంట్ నెట్టింటా జీవాకు సంబంధించే చర్చ తీవ్రంగా నడుస్తున్నది. మీరు అలా ఎలా అంటారంటూ ఓ గాయని కూడా ఆయనను అదే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. అసలు ఇంతకు ఏమైందంటే.. ?


ప్రముఖ తమిళ హీరో జీవా తమిళనాడులోని తేనిలో ఇటీవలే సహనం కోల్పోయి ఓ జర్నలిస్ట్ తో గొడవకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన ఓ గాయని జీవాపై ఫైర్ అయ్యింది. నన్బన్ అంటూ జీవాపై విరుచుకుపడింది.

అయితే, తేనీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జీవాను ఓ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. అదేమంటే.. హేమ కమిటీ నివేదికపై మీ వైఖరేమిటంటూ ఆ జర్నలిస్ట్.. జీవాను అడిగారు. స్పందించిన జీవా.. ఇలా మాట్లాడారు. ‘హేమ కమిటీ నివేదికకు సంబంధించిన అంశం గురించి నేను కూడా విన్నాను. సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి’ అంటూ అతను పేర్కొన్నాడు.


Also Read: నన్ను అలా వేధించారు, దీనిపై మోహన్ లాల్ ఎందుకు మాట్లాడటంలేదు? నటి కస్తూరి కామెంట్స్

ఆ తరువాత మాట్లాడుతూ.. ‘మేము ఒక మంచి కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చాం. అందువల్ల మంచి విషయాలనే మాట్లాడుకుందాం. చాలా రోజుల తరువాత నేను తేని వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ పనులను ముగించుకుని ఇక్కడికి వచ్చాను. చాలా పరిశ్రమలల్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం మా పని. నటులుగా మేం, ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వును తెస్తాం. అందుకే మేం ఇక్కడకు వచ్చాం’ అని జీవా అన్నాడు.

ఆ వెంటనే ఆ జర్నలిస్ట్ మరో క్వశ్చన్ వేశాడు. లైంగిక వేధింపుల సమస్యలు తమిళ సినిమాల్లో కూడా ఉన్నాయా? అని అడగడంతో.. జీవా మాట్లాడుతూ.. ‘కోలీవుడ్ లో అలాంటిదేమీ జరగదు. నేను దీనిపై ఇప్పటికే రిప్లై ఇచ్చాను. మళ్లీ మళ్లీ రిప్లై ఇవ్వను’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తరువాత అసలు ఈ ప్రశ్న లేవనెత్తిన జర్నలిస్టుకు బుద్ధి ఉందా అంటూ సహనం కోల్పాయాడు. ఆ వెంటనే మిగతా జర్నలిస్టులు స్పందించి జీవా ప్రవర్తనను తప్పు పట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అతను అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ స్పందిస్తూ జీవాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పదేళ్లుగా నేను అతన్నీ ప్రేమిస్తున్నా.. ఓపెన్ అయిన సాయి పల్లవి

ఇటు ఓ గాయని కూడా ఈ వీడియోపై స్పందించింది. హీరో జీవాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమిళ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు లేవంటూ మీరెలా చెబుతారని జీవాను ప్రశ్నించింది. జీవా గారి ప్రవర్తను చూసి ఏం మాట్లాడాలో తనకు అర్థంకావట్లేదంటూ ఆమె కామెంట్ పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే.. మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతమైన లైంగిక వేధింపుల కేసులను హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. పరిశ్రమలో శక్తివంతమైన స్థానాల్లో వ్యక్తులు మహిళా నటీనటులను, సాంకేతిక నిపుణులను నిరంతరం ఎలా వేధిస్తున్నారనే విషయాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×